Sports Ministerfelicitates women’s cricket team మిథాలీ సేనకు ప్రకటించిన నజరానా పెంపు..

Sports minister vijay goel felicitates indian women s cricket team

ICC Women's World Cup 2017, India vs Australia, semi finals, india, australia, Harmanpreet kaur, mithali Raj, deepti sharma, Sri lanka, India Women's Cricket Team, cricket news, cricket, sports news, latest news

Minister of State for Youth Affairs and Sports Vijay Goel felicitated the Indian Women’s Cricket team and its support staff at his official residence.

మిథాలీ సేనకు ప్రకటించిన నజరానా పెంపు..

Posted: 07/27/2017 08:59 PM IST
Sports minister vijay goel felicitates indian women s cricket team

ఇంగ్లాండ్ వేదికగా జరుగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన టీమిండియా మహిళల జట్టు.. అందరి అంచనాలను మించి ఫైనల్స్ లోకి వెళ్లి స్వల్పస్కోరుతో ఓటమిపాలైనా వారిపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిస్తుంది. దీంతో మిథాలీ రాజ్ సేనను మరింత ప్రోత్సహించే దిశగా భారత నియంత్రణ మండలి బోర్డు(బీసీసీఐ) అడుగులు వేస్తుంది. ప్రపంచ కప్ లో పాల్గొన్న 15 మందితో కూడిన భారత మహిళా బృందానికి ఇప్పటికే ప్రకటించిన నజరానాకు మరింత పెంచే దిశగా యోచిస్తుంది.

ఫైనల్స్ లో స్థానం సంపాదించుకున్న టీమిండియా మహిళల జట్టును ప్రోత్సహించేందుకు జట్టులోని సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50లక్షలు అందజేస్తామని ఇదివరకే ప్రకటించిన బీసీసీఐ.. వారికి దేశవ్యాప్తంగా వచ్చిన ఆదరణను దృష్టిలో వుంచుకుని మరింత నగదును బహుమానంగా ఇవ్వాలని యోచిస్తోంది. కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఆ మేరకు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా క్రీడాకారిణుల నగదు నజరాను రూ. 60లక్షలకు పెంచాలనే చూస్తోంది.

అదే సమయంలో సహాయక సిబ్బందికి రూ.30 లక్షలను ఇవ్వడానికి బోర్డు పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత్ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మహిళా జట్టుకు, సహాయక సిబ్బందికి నజరానాను పెంచినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని వెస్ట్జోన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీనికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలు ఆడే మ్యాచ్ ఫీజును కూడా పెంచే యెచనలో్ బీసీసీఐ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles