women in blue arrive in Mumbai to grand welcome మిథాలీ సేనకు అభిమానుల గ్రాండ్ వెల్ కమ్

Cricket india women arrive in mumbai to grand welcome

ICC Women's World Cup 2017, India Women's Cricket Team, Harmanpreet kaur, mithali raj, julan goswami, mumbai, deepti sharma, chatrapati shivaji terminal, India Women's Cricket Team, cricket news, cricket, sports news, latest news

The Indian women's cricket team arrived in Mumbai on Wednesday. The players received a grand reception at the airport.

మిథాలీ సేనకు అభిమానుల గ్రాండ్ వెల్ కమ్

Posted: 07/26/2017 06:01 PM IST
Cricket india women arrive in mumbai to grand welcome

ఇంగ్లాండ్ వేదికగా జరుగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల జట్టు అద్యంతం కనబర్చిన అద్బుత ప్రతిభకు ఇంకా వారిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తూనే వుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి చేరకున్న టీమిండియా మహిళీ క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. వీరోచిత ఇన్నింగ్స్ అడిన హర్మన్ ప్రీత్ కౌర్, జట్టు సారధి మిథాలీ రాజ్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి తదితరులు ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకున్నారు.

ఇవాళ తెల్లవారుజామున ఇంగ్లాండ్ నుంచి ముంబై చేరుకున్న జట్టుకు బీసీసిఐ సిబ్బంది, అభిమానులు ఇండియా, జై భారత్ అంటూ నినాదాలు పలుకుతూ మహిళా క్రికెటర్లను ఘనంగా అహ్వానించారు. టోర్ని ఆసాంతం భారత మహిళల ప్రదర్శన భారత అభిమానుల మనసులను గెలుచుకొంది. ఈ సందర్భంగా టీమిండియా మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాము ఊహించని రీతిలో ఘన స్వాగతం లభించిందని అన్నారు. ఇలాంటి స్వాగతాన్ని తాము అంచనా వేయలేదన్నారు.

ప్రస్తుతం క్రీడల్లో అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తున్నారని.. వారంతా వేడుకలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో మహిళా క్రికెట్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదని అయితే ఐసీసీ ప్రపంచ కప్ లో తమ ప్రదర్శనతో ఇప్పుడు అందరూ తమ గురించి చర్చించుకోవడం సంతోషంగా వుందన్నారు. క్రీడల్లో మహిళలు రాణించాలని, మరీ ముఖ్యంగా బాలికలకు చిన్నస్థాయి నుంచి క్రీడలను అందిపుచ్చుకోవాలని అమె అన్నారు. ప్రపంచ కప్ లో రన్నర్ అప్ గా నిలిచిన టీమిండియా మహిళలకు త్వరలో బీసీసీఐ సత్కరించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles