Mithali Raj named captain of ICC Women’s World Cup 2017 team టీమిండియా కెప్టెన్ మిథాలీకి అరుదైన గౌరవం..

Mithali raj named captain of icc women s world cup 2017 team

mithali raj, india women cricket team, deepti sharma, harmanpreet kaur, icc women world cup team of the tournament, icc women world cup 2017, cricket news, sports news, latest sports news, sports, cricket

Mithali Raj was selected as the captain of the Team of the ICC Women's World Cup 2017 which England won by beating India by 9 runs at Lord's

టీమిండియా కెప్టెన్ మిథాలీకి అరుదైన గౌరవం..

Posted: 07/24/2017 07:31 PM IST
Mithali raj named captain of icc women s world cup 2017 team

టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు అమెను కెప్టెన్ గా ఐసీసీ ఎంపిక చేసింది. తాజాగా ముగిసిన వరల్డ్ కప్ లో భారత జట్టును తన నాయకత్వంలో ఫైనల్ కు చేర్చింది. అదివారం జరిగిన ఫైనల్స్ లోనూ తుది వరకు విజయం కోసం పోరాడటంలోనూ అమె స్ఫూర్తిని పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. ఈ 34 ఏళ్ల మిథాలీకి జట్టును నడిపిన విధానాన్ని.. జట్టును ఆ స్థాయికి తీసుకెళ్లిన అమెకు ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది.

కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచిన మిథాలీ బ్యాటింగ్ లోనూ అసాధారణంగా రాణించి 409 పరుగులు చేసింది. అత్యంత కీలకమైన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 109 పరుగులు చేసి జట్టుకు 186 పరుగుల భారీ విజయాన్ని అందించింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. మిథాలీతోపాటు అద్భుతంగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తిశర్మ కూడా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. తాజా వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ల గౌరవార్థం ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో నలుగురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు.


ఐసీసీ ప్రకటించిన మహిళ ప్రపంచకప్‌ జట్టు

తమ్సిన్ బ్యూమొంట్ (ఇంగ్లండ్) - 410 పరుగులు
లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా) - 324 పరుగులు
మిథాలీ రాజ్ (కెప్టెన్) (ఇండియా) - 409 పరుగులు
ఎల్లీ పెర్రి (ఆస్ట్రేలియా) - 404 పరుగులు, తొమ్మిది వికెట్లు
సారా టేలర్ (వికెట్ కీపర్) (ఇంగ్లండ్) - 396 పరుగులు, నాలుగు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్లు
హర్మాన్‌ ప్రీత్ కౌర్ (ఇండియా) - 359 పరుగులు, ఐదు వికెట్లు
దీప్తీశర్మ (ఇండియా) - 216 పరుగులు మరియు 12 వికెట్లు
మారిజన్నె కప్ (దక్షిణాఫ్రికా) - 13 వికెట్లు
అలెక్స్ హార్ట్లీ (ఇంగ్లండ్) - 10 వికెట్లు
నాటాలిసైవర్ (12వ ప్లేయర్‌) (ఇంగ్లండ్) - 369 పరుగులు, ఏడు వికెట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithali raj  ICC  Women's World Cup team  deepti sharma  harmanpreet kaur  cricket  

Other Articles