భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు చెన్నై జట్టుకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కూడా చెన్నై సూపర్‌కింగ్స్ జెర్సీ ధరించి దిగిన ఓ ఫొటోను తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారింది.
7వ నెంబర్ జెర్సీ ధరించిన ధోనీ తన ఇంటి ముందు దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. జెర్సీపై తన పేరు ఉండాల్సిన స్థానంలో ‘తలా’ అని పేర్కొన్నాడు. తలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ధోనీ పెట్టిన ఈ ఫొటోకి సోషల్‌మీడియాలో విపరీతమైన లైక్‌లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి. గత రెండు సీజన్లలో ధోనీ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. 2017 ఐపీఎల్ ఫైనల్లో పుణె... ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2018 ఐపీఎల్ సీజన్ కోసం తమ పాత ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశముంటే.. మాజీ కెప్టెన్ ధోనీని వదులుకునే అవకాశమే లేదని చెన్నై ఫ్రాంఛైజీ ప్రతినిధి జాన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more