Karun Nair, Pandey to lead India 'A' teams in South Africa సఫారీలపై స్వారీకి టీమిండియా యువ జట్టు

Karun nair pandey to lead india a teams in south africa

India A team, karun nair, manish pandey, south africa, Team India, Ajinkya Rahane, India 'A' Tour, India vs Sri Lanka 2017, karun nair, Rishabh Pant, Sri Lanka vs India 2017, Team India, virat kohli, cricket news, sports news, spots, cricket

Senior team players Karun Nair and Manish Pandey were named skippers of India A’s unofficial Test and one-day teams respectively, for upcoming South Africa tour.

సఫారీలపై స్వారీకి టీమిండియా యువ జట్టు

Posted: 06/29/2017 07:28 PM IST
Karun nair pandey to lead india a teams in south africa

వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఏ జట్టును బిసిసిఐ ఇవాళ ప్రకటించింది. సఫారీలపై స్వారీ చేసిన విజయంతో తిరిగిరావాలని అకాంక్షిస్తూ టీమిండియా ఏ జట్టులో సీనియర్ అటగాళ్లకు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. దీంతో పాటు ముక్కోణపు వన్డే సిరీస్ కూడా వుండటంతో జట్టును పటిష్టంగా వుండేలా బిసిసిఐ చర్యలు తీసుకుంది. ఇందుకోసం కరుణ్ నాయర్, మనీష్ పాండేలను కెప్టెన్లుగా ఎంపిక చేసింది. ఈ సిరీస్ ల కోసం భారత-ఎ జట్టు జులై, ఆగస్టులో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.

ఆస్ట్రేలియా, భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ జులై 26న ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇండియా-ఎ... ఆస్ట్రేలియా-ఎతో తలపడనుంది. ఫైనల్‌ ఆగస్టు 8న జరగనుంది. దీంతో వన్డే జట్టుకు కెప్టెన్ గా మనీష్ పాండేకు బిసిసిఐ పగ్గాలను అందించింది. కాగా ఆ తర్వాత దక్షిణాఫ్రికా-ఎతో భారత్‌-ఎ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఒక్కో టెస్టు నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ మ్యాచులకు కెప్టెన్సీ పగ్గాలను కరుణ్ నాయర్ కు అప్పగించింది. కాగా జట్టు సభ్యుల వివరాలు ఇలా వున్నాయి.

వన్డే జట్టు: మన్‌దీప్‌ సింగ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, సంజు సామ్‌సన్‌, మనీశ్‌ పాండే(కెప్టెన్‌), దీపక్‌ హుడా, కరుణ్‌ నాయర్‌, కృనాల్‌ పాండ్య, రిషబ్‌పంత్‌(వికెట్‌కీపర్‌), విజయ్‌ శంకర్‌, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, జయంత్‌ యాదవ్‌, బసిల్‌ ధంపి, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సిద్ధార్ద్‌ కౌల్‌

టెస్టు జట్టు: ప్రియాంక్‌ పంచల్‌, అభినవ్‌ ముకుంద్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అంకిత్‌ బ్వానే, కరుణ్‌ నయర్‌(కెప్టెన్‌), సుదీప్‌ ఛటర్జీ, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హనుమ విహారి, జయంత్‌ యాదవ్‌, షబాజ్‌ నదీమ్‌, నవదీప్‌ సైని, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అంకిత్‌ చైదరి, అంకిత్‌ రాజ్‌పుత్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India A team  karun nair  manish pandey  south africa  Team India  cricket  

Other Articles