Mustafizur Rahman Worried Ahead of Semi-final Clash భారత క్రికెటర్లకు బంగ్లా బౌలర్ హెచ్చరికలు

Mustafizur rahman worried ahead of semi final clash

champions trophy 2017, ICC Champions Trophy 2017, india vs bangladesh, Live Cricket Score, live score, mashrafe mortaza, MS Dhoni, mustafizur rahman, rohit sharma, shikhar dhawan, virat kohli

Bangladesh pacer Mustafizur Rahman is hoping his off-cutters, which are not working in England as much they used to at home, come good against India in the ICC Champions Trophy semi-final

భారత క్రికెటర్లకు బంగ్లా బౌలర్ హెచ్చరికలు

Posted: 06/14/2017 07:22 PM IST
Mustafizur rahman worried ahead of semi final clash

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తొలి అంకం ముగిసి రెండో అంకానికి చేరుకున్న నేపథ్యంలో కత్తులు నూరుతున్న ప్రత్యర్థి జట్టు.. సెమీఫైనల్ లో విజయమే లక్ష్యంగా మైండ్ గేమ్ ను కూడా అడుతున్నారు. టీమిండియా మాత్రం సెమీఫైనల్ లో విజయం కోసం ప్రాక్టీసు చేస్తుండగా, ఇటు బంగ్లాదేశ్ జట్టు కూడా ఓ వైపు ప్రాక్టీసు చేస్తూనే.. మరో వైపు మైండ్ గేమ్ కు కూడా ప్రాథాన్యత ఇస్తుంది. ఇందుకు ఆ దేశానికి చెందిన కీలక బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ భారత ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేయడమే నిదర్శంగా నిలుస్తుంది.

ఈ టోర్నీలో మూడు మ్యాచ్ లు ఆడి ఒకే వికెట్ తీసిన ముస్తాఫిజుర్, సెమీస్ లో తాను రాణిస్తానని, భారత ఆటగాళ్లకు ఆఫ్ కట్టర్ లు సంధించి ఇబ్బంది పెడతానని అంటున్నాడు. రేపటి మ్యాచ్ లో విజయం తమదేనని ధీమాగా చెప్పిన ముస్తాఫిజుర్, ఇండియన్ ప్లేయర్స్ ను నిలువరించి చూపుతానని, ఇంగ్లండ్ లోని పిచ్ లు పేసర్లకు పెద్దగా అనుకూలించక పోవడంతోనే తనకు వికెట్లు దక్కలేదని అన్నాడు. తన శక్తి వంచన లేకుండా బంగ్లాదేశ్ విజయానికి కృషి చేస్తానని, ఈ మ్యాచ్ లో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Champions Trophy  Team india  bangladesh  mustafizur rahman  virat kohli  cricket  

Other Articles