Virender Sehwag enters 'Crorepati club' on Twitter కోటీశ్వరుడైన డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

Virender sehwag enters crorepati club on twitter celebrates with a witty video

sehwag, virender sehwag, sehwag tweet, sehwag tweets, virender sehwag tweets, virender sehwag twitter, sehwag twitter crorepati, kings xi punjab, cricket news, latest news

Former Indian opener Virender Sehwag who was known for his swashbuckling batting on-field and witty humour off-field, became a ‘Twitter crorepati’.

కోటీశ్వరుడైన డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

Posted: 05/24/2017 08:06 PM IST
Virender sehwag enters crorepati club on twitter celebrates with a witty video

భారత మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తాను కోటీశ్వరుడయ్యానంటూ ప్రకటించాడు. అదేంటి, సెహ్వాగ్ ఇప్పుడు కోటీశ్వరుడవ్వడమేంటన్న అనుమానం వచ్చిందా?... దేశం తరపున ఎన్నో మ్యాచ్ లు ఆడి, టన్నుల కొద్దీ పరుగులు చేసిన సెహ్వాగ్ ఆర్థికంగా ఎప్పుడో కోటీశ్వరుడు. అయితే ఇప్పుడీ ప్రకటన ఎందుకు చేశాడు అంటారా..? క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత ఆయన ఒక కామెంట్ రైటర్ గా మారాడు. అదేనండీ తన సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా దేశంలోని తాజా రాజకీయాల నుంచి తనకు మనస్సును స్పందింపజేసిన ప్రతీ అంశంపై స్పందిస్తూ ఎప్పటికప్పడు తన అభిమానులతో పంచుకుంటూ వారిని అలరిస్తున్నారు.

అయితే తాజాగా అతని ట్విట్టర్ ఖాతాను కోటి మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. దీంతో తన ఫాలోయింగ్‌ సంఖ్య కాస్తా ఇప్పుడు కోటికి చేరడంతో ట్విటర్‌లో తాను కరోడ్‌పతిని అయ్యానని తనదైన శైలిలో ఓ ట్వీట్‌ చేశారు. మీ ప్రేమాభిమానాలతో ట్విటర్‌లో నన్ను కరోడ్‌పతిని చేసినందుకు కోటి మంది అభిమానులకు కృతజ్ఞతలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒకప్పుడు బ్యాటింగ్ తో అలరించిన సెహ్వాగ్ క్రికెట్ నుంచి రిటైరయ్యాక తనదైన శైలిలో ట్వీట్లతో అలరిస్తున్నాడు. ఇకపై కూడా ఇలాగే అలరించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virender sehwag  twitter  crorepati  cricket news  latest news  

Other Articles