వికెట్ దూరంలో.. మరో రికార్డు.. కోహ్లీపై నమ్మకం లేదు.. ashwin milestone just a wicket away

Ravichandran ashwin s milestone just a wicket away at dharmasala

india vs australia, Border-Gavaskar Trophy 2016-17, Dharamsala, Ravichandran Ashwin, Virat Kohli, cricket

Team India spinner Ravichandran Ashwin needs only one more wicket to break the record of Dale Steyn for taking most wickets in a season.

వికెట్ దూరంలో.. మరో రికార్డు.. కోహ్లీపై నమ్మకం లేదు..

Posted: 03/24/2017 08:31 PM IST
Ravichandran ashwin s milestone just a wicket away at dharmasala

పర్యాటక జట్టు అస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో బాగంగా జరుగుతున్న తుది నాల్గవ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా..? అన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ధర్మశాల వేదకగా జరుగునున్న టెస్టులో విరాట్ తుది జట్టులో కొనసాగుతారా..? అన్నది శనివారం రోజు ఉదయమే తేలనుంది.

అయితే రమారమి కోహ్లీ అడే అవకాశాలు లేవన్న వార్తలను తోసిపుచ్చుతున్న బిసిసీఐ వర్గాలు.. తుది జాబితాలో మాత్రం మహమ్మద్ షమీ సమీ, శ్రేయస్ అయ్యార్ పేర్లను మాత్రం చేర్చింది. పేస్ బౌలర్లకు అనుకూలంగా వుండే ఈ పిచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది తేలాలంటే మరో రెండు మూడు రోజుల అగాల్సిందే. ఈ టెస్టులో గెలిచిన వారికే సిరీస్ కూడా దక్కే అవకాశం వుంది.

ఈ విషయాన్ని పక్కన బెడితే.. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరొక్క రికార్డును నెలకొల్పేందుకు వికెట్ దూరంలో వున్నాడు. అ రికార్డు ఏంటేంటే.. ఒకే సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రపుటల్లోకి ఎక్కనున్నాడు. సింగిల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు(79) తీసిన బౌలర్‌గా అవతరించనున్నాడు. ప్రస్తుతం 2016-17 సీజన్‌లో 78 వికెట్లు తీసి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఆటగాడు డెల్ స్టెయిన్‌తో పంచుకుంటున్నాడు. స్టెయిన్ 2007-08 సీజన్‌లో 78 వికెట్లు తీశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles