స్మీత్ పై చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం du Plessis surprised at ICC over India spat

Du plessis surprised at icc over india australia drs dispute

India v Australia, Virat Kohli, Steve Smith, Faf du Plessis, DRS dispute, David Richardson, cricket news, sports news, sports, cricket

South Africa captain Faf du Plessis said he was surprised that no one was charged by the ICC on the controversial DRS referral issue that led to a war of words between India and Australia.

స్మీత్ పై చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం

Posted: 03/12/2017 07:07 PM IST
Du plessis surprised at icc over india australia drs dispute

భారత్ తో రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డు ప్లెసిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వివాదం చాలా పెద్దదైనప్పటికీ దాన్ని ఐసీసీ చాలా తేలిగ్గా తీసుకోవడాన్ని డుప్లెసిస్ తప్పుబట్టాడు. అసలు మొత్తం విషయాన్ని పక్కకు పెట్టిన ఐసీసీ.. ఆ రగడపై కనీస చర్యలు  ఎందుకు  చేపట్టలేదో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశాడు.

'ఇటీవల మా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు నేను బాల్ టాంపరింగ్ చేశానని ఆ జట్టు తీవ్రంగా ఆరోపించింది. నోటిలో ఉన్న మింట్ ను తీసి రుద్దానంటూ అనవసర రాద్దాంతం చేసింది. దానిపై ఐసీసీ కూడా తీవ్రంగా స్పందించింది. నేను ఏ తప్పు చేయలేదని విన్నవించుకున్నా చివరికు జరిమానా విధించారు. అప్పుడు నా పట్ల ఐసీసీ కఠినంగా ప్రవర్తించింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని ఎలా పక్కకు  పెట్టేసింది. ఆ వివాదంపై ఏ ఆటగాడిపై చర్యలు కనీస చర్యలు తీసుకోలేదు. ఇది నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచిన విషయమే కాదు.. చాలా సీరియస్ గా ఆలోచింపజేసిన అంశం'అని డు ప్లెసిస్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India v Australia  Virat Kohli  Steve Smith  Faf du Plessis  DRS dispute  David Richardson  cricket  

Other Articles