బెంగళూరు టెస్టులో పట్టిన డైవింగ్ క్యాచ్ కంటే పుణె తొలి టెస్టులో క్యాచే మిన్న అని భారత వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా తెలిపాడు. వికెట్ కీపర్ గా మరింత ఎదగడానికి ఈ తరహా క్యాచ్ లు దోహదం చేస్తాయని సాహా ఆనందం వ్యక్తం చేశాడు. ఆసీస్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రెండు అద్భుతమైన క్యాచ్ లను పట్టినప్పటికీ పుణె టెస్టులో పట్టిన క్యాచే కఠినమైనదిగా తెలిపాడు. 'బెంగళూరులో పట్టిన ఒక క్యాచ్ కంటే పుణె టెస్టులో పట్టిన క్యాచే అద్భుతం. ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి నేను స్పందించిన సమయం చాలా తక్కువ. చాలా తక్కువ సమయంలో ఆ క్యాచ్ ను ఒడిసి పట్టుకున్నా. అదే బెస్ట్ క్యాచ్' అని తన సాహా రేటింగ్ ఇచ్చుకున్నాడు. ఈ క్యాచ్ తరువాత తనను సూపర్ మ్యాన్ అంటూ పొగడటంపై సాహా సంతోషం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత పేసర్ ఉమేశ్ యాదవ్ 82 ఓవర్ లో సాహా గాల్లో డైవ్ కొట్టి క్యాచ్ ను అందుకున్న తీరు అదుర్స్ అనిపించింది. ఉమేశ్ 141కి.మీ వేగంతో సంధించిన ఆ బంతిని ఆసీస్ ఆటగాడు ఓకీఫ్ కట్ చేయబోయాడు. అదే వేగంతో ఆ బంతి ఫస్ట్ స్లిప్ కు దారి తీసింది. అయితే సాహా మాత్రం రెప్పపాటులో గాల్లో చక్కటి డైవ్ కొట్టి క్యాచ్ ను అందుకున్నాడు. అసాధారణ రీతిలో సాహా క్యాచ్ పట్టడం టీమిండియా సభ్యుల్ని ఒక్కసారిగా నిశ్చేష్టుల్ని చేసింది. దీనిపై విరాట్ కోహ్లి ప్రశంసల కురిపించిన సంగతి తెలిసిందే. మరొకవైపు సాహా పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more