కోహ్లీ అలా చేసివుంటే.. పరిణామాలు ఇలాగే వుండేవా.? Gavaskar criticises ICC for no action against Steve Smith

Sunil gavaskar slams icc for taking no action against steve smith

india vs australia, steve smith, virat kohli, sunil gavaskar, india, australia, Team India, india australia bangalore test, india australia bengaluru test, m chinnaswamy stadium, national cricket academy, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Former India captain Sunil Gavaskar slammed the ICC for not taking any action against the Australian captain Steve Smith in DRS 'Brain Fade' episode.

బెంగళూరు పరిణామాలపై చర్యలు తీసుకోరా.? ఐసిసిపై లిటిల్ మాస్టార్ ద్వజం

Posted: 03/09/2017 07:44 PM IST
Sunil gavaskar slams icc for taking no action against steve smith

బెంగళూరులో చోటుచేసుకున్న పరిణామాలపై భారత క్రికెట్‌ మాజీ సారథి, లిటిల్ మాస్టర్ సునీల్‌ గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశారు. పరిణామాలు చోటుచేసుకున్న తరువాత కూడా ఇంకా అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య అస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించడంపై ఆయన మండిపడ్డారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో రెండో టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ చేసిన తప్పునకు ఐసీసీ అతడిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని గావస్కర్‌ ప్రశ్నించారు. అన్ని దేశాల ఆటగాళ్ల పట్ల ఐసీసీ ఒకే విధంగా ప్రవర్తించాలని, ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపకూడదని గావస్కర్‌ అన్నారు.

తదుపరి టెస్టులో ఒకవేళ స్మిత్‌ చేసినట్లు ఎవరైనా భారత ఆటగాడు చేస్తే ఐసీసీ ఇలాగే ప్రవర్తిస్తుందా.. అని అడిగారు. స్మిత్‌పై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ కోరిన అనంతరం.. ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్‌ గావస్కర్‌ ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బెంగళూరు టెస్టులో స్మిత్‌ చేసినట్లు తదుపరి టెస్టులో కోహ్లి చేయాలని కోరుకుంటున్నా. అంపైర్‌ ఔట్‌ అని ప్రకటించినా... అతడు మైదానం వీడకుండా డ్రస్సింగ్‌ రూమ్‌ వైపు చూడాలనుకుంటున్నా. అప్పుడేం జరగుతుందో చూద్దాం. మ్యాచ్‌ రిఫరీలు, ఐసీసీ ఏవిధంగా స్పందిస్తుందో చూద్దాం! అంటూ అసహనం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  steve smith  virat kohli  sunil gavaskar  india  australia  Team India  bangalore  cricket  

Other Articles