గట్స్ వున్న టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా..? I Always Wanted to Bat Like Virender Sehwag, Says Sunil Gavaskar

I always wanted to bat like virender sehwag says sunil gavaskar

india vs australia, team indai, australia tour of india 2017, cricket, cricket news, virat kohli, sunil gavaskar, virender sehwagi, india, australia, cricket

Batting legend Sunil Gavaskar said the current Indian team under Virat Kohli was "fulfilling my dreams". He said when Virender Sehwag arrived on the scene, he saw someone was hitting the ball the way he always wanted.

గట్స్ వున్న టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా..?

Posted: 02/23/2017 07:09 PM IST
I always wanted to bat like virender sehwag says sunil gavaskar

తన లక్ష్యాలను, ఆశయాలను  విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు సాధిస్తుందని మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. టెస్టుల్లో వరుస విజయాలతో జట్టు దూసుకెళ్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోహ్లీ కెప్టెన్సీలోని ప్రస్తుత జట్టు మరిన్ని అద్బుతాలు  చేస్తుందన్నారు. తన పుస్తకం 'సన్నీ డేస్' 40 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గవాస్కర్ మరిన్ని విషయాలను ప్రస్తావించారు. పుణెలో స్పోర్ట్స్ లిటరరీ ఫెస్టివల్ లో భాగంగా మాట్లాడుతూ.. వీరేంద్ర సెహ్వాగ్, అచ్చంగా తనలాగానే బ్యాటింగ్ చేసేవాడని, ఇద్దరి శైలి ఒకే తీరుగా ఉండేదని అన్నాడు.

‘‘సెహ్వాగ్ తాను అనుకున్నట్లుగా బంతిని పవర్ ఫుల్‌గా బాదేవాడు. నాకు కూడా సెహ్వాగ్ లాగే బ్యాటింగ్ చేయాలని ఉండేది. బ్యాటింగ్‌లో గట్స్ ఉన్న భారత క్రికెటర్లలో సెహ్వాగ్ ఒకడు. టెస్టుల్లో తొలి బంతిని స్ట్రెయిట్ సిక్సర్ గా మలచాలని ఎప్పుడూ తాపత్రయ పడేవాడిని. ఓసారి ఈ ఫీట్ సాధించాను. కానీ సెహ్వాగ్ మాత్రం చాలాసార్లు ఇలాంటి ఫీట్లను మన ముందు ఆవిష్కరించాడు. ట్వంటీ20 ఫార్మాట్‌తో క్రికెట్‌కు ఎలాంటి నష్టం లేదు. ఆటకు ట్వంటీ20లు ఎంతో మేలు చేశాయి. ఏది ఏమైనా ఆటగాడి నైపుణ్యాన్ని చెప్పాలంటే టెస్టు గణాంకాలను ఆధారంగా తీసుకోవాలి' అని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. నేడు పుణెలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles