భారత క్రికెట్ పై జరుగుతున్న కుట్రలు ఫలించవు Nonsense to call India a bully, says Ravi Shastri

Don t try to take advantage of bcci s current mess warns shastri

Ravi Shastri, Vikram Limaye, Lodha panel, Lodha Committee, BCCI, Anurag Thakur, Anirudh Chaudhry, Anil Kumble, Amitabh Choudhary, sport, cricket

A few nations are making a big mistake by trying to take advantage of the current mess that Indian Cricket Board is in, warned former captain Ravi Shastri

భారత క్రికెట్ పై జరుగుతున్న కుట్రలు ఫలించవు

Posted: 02/17/2017 06:01 PM IST
Don t try to take advantage of bcci s current mess warns shastri

భారత క్రికెట్ పై జరుగుతున్న కుట్రలు ఫలించవని టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి హెచ్చరించాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ బోర్డు తెలుసుకోవడంలో జాప్యం చేస్తే.. బంగారు బాతు గుడ్లను పెట్టే బాతను చంపినల్లేనని అవుతుందని ఆయన ఉదహరించాడు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో చోటు చేసుకున్న సంక్షోభాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవద్దని వరల్డ్ క్రికెట్  బోర్డులకు సూచించాడు. బీసీసీఐలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనన్న విషయం గుర్తిస్తే మంచిదని హితవు పలికాడు. త్వరలోనే బిసిసిఐ పూర్వవైభవానికి చేరకుంటుందని అభిప్రాయపడ్డారు.

బీసీసీఐ నుంచి 80 శాతం ఆదాయం ఐసీసీకి సమకూరుతున్నప్పుడు అన్ని బోర్డులకు సమాన వాటా ఉండాలనే తాజా నిర్ణయంతో రవిశాస్త్రి విభేదించాడు. కేవలం బీసీసీఐ అడిగేది ఎక్ప్ట్రా షేరే కానీ, ఆ 80 శాతాన్ని ఇమ్మని అడగడం లేదు కదా అని నిలదీశాడు. భారత్ ను పక్కన పెడితే, ఎంత ఆదాయం వస్తుందో కూడా ఐసీసీ చూసుకోవాలని రవిశాస్త్రి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బీసీసీఐకు ఒక్క శ్రీలంక మాత్రమే అండగా నిలవగా, బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి  చిన్న క్రికెట్ బోర్డులు కూడా మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.

ఇటివల ఐసీసీ తమ సభ్య దేశాలకు పంపిణీ చేసే ఆదాయ ఫార్ములాలో విప్లవాత్మకమైన మార్పులకు ఓటేసింది. ఈ ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకించింది. ఈ విషయంలో భారత్‌కు కేవలం శ్రీలంక నుంచి మాత్రమే మద్దతు లభించింది. జింబాబ్వే ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆదాయ పంపిణీలో మార్పులతో పాటు పరిపాలనా వ్యవస్థలో మార్పులకు మద్దతుగా ఓటింగ్‌లో పాల్గొన్నాయి.ఏప్రిల్‌లో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles