ఆ నిర్ణయం తీవ్ర మనోవేదనకు గురిచేసింది Morné Morkel conquers injury hurdles

Morne morkel was told he would never be able to play cricket again

Morne Morkel, South African pacer, cricket, Kolkata Knight Riders, IPL, West Indies, cricket news, sports news, cricket

South African pacer Morne Morkel is all set to make a comeback into the national side and has recently made a revelation about his past related to his game.

ఆ నిర్ణయం తీవ్ర మనోవేదనకు గురిచేసింది

Posted: 02/16/2017 06:41 PM IST
Morne morkel was told he would never be able to play cricket again

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో కీలక క్రికెటరైన మోర్నీ మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేయడానికి రెడీ అయ్యాడు. దాదాపు ఎనిమిది నెలలు కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ కు ఆయన గాయం కారణంగా దూరమయ్యారు. ఆటలో తగిలిన గాయం కాకుండా వెన్ను నోప్పి కారణంగా గతేడాది జూన్ లో జట్టుకు దూరమయ్యాడు. కాగా చాలా కాలం తరువాత మళ్లీ వన్డే జట్టులోకి వచ్చేందుకు పూర్తి ఫిట్ నెన్ తో వున్నాడు.

తాను జట్టుకు దూరమైన సమయంలో.. తాను ఇక క్రికెట్ ను ఆడటానికి పనికిరానని.. అందుచేత క్రికెట్ ను వదులుకోవాలని డాక్టర్లు సలహా ఇవ్వడం తీవ్రమైన మనోవేదనకు గురిచేసిందని.. ఎలాగైన జట్టులో తిరిగి స్థానం సంపాదించాలన్న కసితో పూర్తి ఫిట్ గా మారిన మోర్కెల్ తాజాగా స్సష్టం చేశాడు. ప్రస్తుతం మొమెంటమ్ వన్డే కప్ మ్యాచ్ ఆడనున్న మోర్కెల్... తాను పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ ను నిరూపించుకుని మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.

'గతంలోనే నన్ను క్రికెట్ ను వదిలేయమనే సలహా డాక్టర్లు ఇచ్చారు. నేను వెన్నునొప్పితో బాధపడుతున్న తరుణంలో క్రికెట్ నుంచి దూరంగా ఉండమని ఒక డాక్టర్ చెప్పాడు. ఇక నేను క్రికెట్ ఆడటానికి పని చేయనని తేల్చిచెప్పాడు. ఆ క్షణంలోనే నా క్రికెట్ కెరీర్ పై అనుమానం వచ్చింది. ఇక క్రికెట్ ను ఆడగలనా?అనే సందేహం నన్ను ఆందోళనలో పడేసింది. అయితే అప్పట్నుంచి నా ఫిట్ నెస్ నిరూపించకోవడం కోసం శ్రమిస్తూనే ఉన్నా. ఆ డాక్టర్ ఇచ్చిన సలహా పక్కను పెట్టేశా.  నాకు నేనుగా వెన్నునొప్పి నుంచి బయట పడేందుకు కష్టపడుతూనే ఉన్నా. ఆ క్రమంలోనే వేరే డాక్టర్ల సలహాలను కూడా తీసుకున్నా. ఇప్పుడు వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్నా. త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టులో చోటు కూడా దక్కించుకుంటా' అని మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles