ఉప్పల్ టెస్ట్... విక్టరీనే కాదు... కోహ్లీ సాధించిన రికార్డులు ఏంటంటే... | Virat Kohli most successful Indian captain after the first 23 Tests.

India win by 208 runs in uppal test

Uppal Test, India Bangladesh, Virat Kohli Captaincy Record, Hyderabad Test, India Bangladesh Test, 208 Runs Victory, India Victory, Uppal India Bangladesh, India Hyderabad Test, Paytm Test Match

India Beat Bangladesh By 208 Runs in Uppal Test. Extend Unbeaten Run to 19. Virat Kohli and Co thrash visitors by 208 runs to clinch 8th Test win of home season.

ఉప్పల్ టెస్ట్ లో టీమిండియా బంపర్ విక్టరీ

Posted: 02/13/2017 03:56 PM IST
India win by 208 runs in uppal test

బంగ్లాదేశ్ తో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. వరల్డ్ నెంబర్ వన్ జట్టుకు ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టు సరైన పోటీనివ్వలేకపోయింది. దీంతో వరుసగా ఆరు సిరీస్ లు గెలుచుకోవటమే కాదు, 15 విజయాలతో కెప్టెన్ గా కోహ్లీ, అజారుద్దీన్, ధోనీ రికార్డులను చెరిపివేశాడు.

తొలి ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (108), ఛటేశ్వర్ పూజారా (83), కోహ్లీ (204), అజింక్యా రహానే (82), సాహా (106) రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 687 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు షకిబల్ హసన్ (82), కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (127), మెహదీ అల్ హసన్ (51) రాణించడంతో 388 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో పుజారా (54) రాణించడంతో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 459 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టును రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరి నాలుగు వికెట్లు తీసి కుప్పకూల్చారు. వారికి ఇషాంత్ శర్మ రెండు వికెట్లతో జతకలవడంతో బంగ్లాదేశ్ జట్టు 250 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో 208 పరుగుల భారీ ఆధిక్యంతో భారత జట్టు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

చివరి బాల్ డ్రామా... 

చివరి రోజు 7 వికెట్లు పడితే భారత్ విజయం ఖాయం. ఈ దశలో ఇషాంత్, జడేజా, అశ్విన్ ల దెబ్బకు బ్యాట్స్ మెన్ క్యూ కట్టారు. అయితే చివరి బ్యాట్స్ మెన్ మాత్రం కాసేపు పోరాడారు. సరిగ్గా టీ బ్రేక్ కు అశ్విన్ వేసిన లాస్ట్ బాల్ బ్యాట్స్ మెన్ టస్కిన్ అహ్మద్ ప్యాడ్ ను తాకి గాల్లో లేవగా ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బ్యాట్ కు తాకలేదంటూ దానిని అంఫైర్ నాటౌట్ గా ప్రకటించటంతో కోహ్లీ రివ్యూను కోరాడు. బంతి బ్యాట్ ను తాకపోయినప్పటికీ, స్టంప్ మీదుగా వెళ్లటంతో ఎల్బీడబ్ల్యూగా బ్యాట్స్ మెన్ వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో టీ బ్రేక్ కు ముందుగానే భారత్ విజయం నమోదైంది. ఇక అత్యధిక రివ్యూలు కోరి సక్సెస్ అయిన కెప్టెన్ గా కోహ్లీ మరో రికార్డు కూడా నెలకొల్పాడు లేండి. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uppal Test  Bangladesh  Team India  Won  

Other Articles