క్రికెటర్ అల్విరో పీటర్సన్ పై రెండేళ్ల నిషేధం Alviro Petersen fear for safety after his match-fixing confession

Alviro petersen feared for safety following match fixing investigations

Alviro Petersen, safety, match fixing allegations, Cricket South Africa, South Africa, Cricket

Banned former South Africa Test batsman Alviro Petersen said, he hired a bodyguard because he feared for the safety of himself and his family during investigations into cricket match-fixing.

క్రికెటర్ అల్విరో పీటర్సన్పై రెండేళ్ల నిషేధం

Posted: 12/23/2016 06:44 PM IST
Alviro petersen feared for safety following match fixing investigations

దేశవాళీ క్రికెట్ లీగ్లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు ఎదర్కోన్న దక్షిణాప్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్పై ఎట్టకేలకు నిషేధం వేటు పడింది. పీటరన్స్ ను దోషిగా తేల్చిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. అతనిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. 2014-15 సీజన్లో జరిగిన దేశవాళీ క్రికెట్ లీగ్లో ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారించిన బోర్డు అతనిపై వేటు వేసింది. ఈ మేరకు పీటర్సన్ పై దర్యాప్తు ముగిసిన తరువాత  అతను మ్యాచ్ ఫిక్సర్ గా పేర్కొంటూ నిషేధం విధించింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిషేధానికి గురైన ఆరో క్రికెటర్ పీటర్సన్.

2015 రామ్ స్లామ్ టోర్నీలో పలువురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. ఆ ఫిక్సింగ్ ఉదంతానికి సంబంధించి మిగతా క్రికెటర్లపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ పేర్కొంది. 2000వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే ఫిక్సింగ్ కు కేసులో నిషేధం ఎదుర్కొన్న తరువాత మరొక అత్యున్నత ప్రొఫెల్ కల్గిన దక్షిణాఫ్రికా క్రికెటర్ పై నిషేధం పడటం ఇదే తొలిసారి.

ప్రస్తుతం పీటర్సన్ వయసు 36 ఏళ్ల కావడంతో అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండేళ్ల పాటు నిషేదం తరువాత అతని వయస్సు 40 ఏళ్లకు చేరుకోనున్న నేపథ్యంలో ఆయనకు నిషేధం వేటు జట్టు నుంచి వెళ్లిపోయేందుకు ఫెయిర్ వెల్ గా మారిందని కూడా క్రీడా విశ్లేషకులు ఎద్దేవా చేశారు. తాజాగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన అల్విరో పీటర్సన్.. దక్షిణాఫ్రికా తరపున 36 టెస్టు మ్యాచ్లు ఆడి ప్రస్తుతం నిషేధం వేటుకు గురయ్యాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alviro Petersen  safety  match fixing allegations  Cricket South Africa  South Africa  Cricket  

Other Articles