దక్షిణాఫ్రికా నాటి ఓపెనర్ సిడ్ ఓ లిన్ ఇక లేరు.. Ex-Proteas cricketer Sid O'Linn passes away

Former south africa test cricketer sid o linn dies

south africa, proteas cricketer, opener, formet cricketer, sid O linn, wicket keeper

Former South Africa opener Sid O'Linn died in Cape Town at the age of 89. An obdurate left-hand batsman and stand-in wicketkeeper, O'Linn had played seven Tests for South Africa between 1960 and 1961.

దక్షిణాఫ్రికా నాటి ఓపెనర్ ఇక లేరు..

Posted: 12/13/2016 06:48 PM IST
Former south africa test cricketer sid o linn dies

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ సిడ్ ఓ లిన్ కన్నుమూశారు. సఫారీల క్రికెట్ జట్టుకు ఓపెనర్ గా, అటు స్టాండ్ ఇన్ వికెట్ కీపర్ గా కూడా ఆయన 1960 నుంచి 1962 వరకు సేవలందించారు. కేప్టౌన్లో ఓలిన్ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 1960-61 కాలంలో ఏడు టెస్టు మ్యాచ్లను మాత్రమే ఓలిన్ తన కెరీర్లో ఆడారు. దాదాపు 92 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఓలిన్ 35.62 సగటుతో 4,525 పరుగులు చేశాడు. ట్రాన్స్ వాల్, వెస్ట్రన్ ప్రొవెన్సీ, కెంట్ల తరపున ఓలిన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. స్వతహాగా వికెట్ కీపర్ అయిన ఓలిన్ మంచి ఫీల్డర్ కూడా కావడంతో అతను చాలా మ్యాచ్ల్లో కీలక పాయింట్లలో ఫీల్డింగ్ చేసేవాడు.  

1960లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా జట్టులో తొలిసారి ఈ ఓపెనర్కు అవకాశం దక్కింది. ఆ సీజన్ లో ట్రాన్స్ వాల్ తరపున ఓలిన్ 68.78 సగటుతో 619 పరుగులు చేయడంతో అతనికి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా జట్టులో అవకాశం కల్పించారు. ఇంగ్లండ్ టూర్లో ఓలిన్ నమోదు చేసిన 98 పరుగులే అతని అత్యధిక స్కోరు. అనంతరం న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సైతం ఓలిన్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆ పర్యటన తరువాత ఓలిన్ పేలవమైన ఫామ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south africa  proteas cricketer  opener  formet cricketer  sid O linn  wicket keeper  cricket  

Other Articles