కోహ్లీతో ఆజమ్ ను పోల్చిన మిక్కీ అథుర్ Mickey Arthur equates Babar Azam with Virat Kohli

Mickey arthur equates babar azam with virat kohli

Mickey Arthur, Babar Azam, Virat Kohli, Pakistan, India, Cricket, Australia v/s Pakistan, joe root, de cock, england, south africa, india, pakistan, sports news, sports, cricket news, cricket

Pakistan head coach Mickey Arthur has heaped praise on right-handed batsman Babar Azam, saying he is as good as swashbuckling Indian batsman Virat Kohli.

కోహ్లీతో ఆజమ్ ను పోల్చిన మిక్కీ అథుర్

Posted: 12/03/2016 06:21 PM IST
Mickey arthur equates babar azam with virat kohli

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మూడు రకాల ఫార్మెట్లలో చూపుతున్న ప్రతిభతో ప్రస్తుతం ఆయన ప్రపంచ క్రికెట్ లోనే సాటిలేని క్రికెటర్ గా వెలుగొందుతున్నాడు. అందుకనే కాబోలు కోహ్లీతో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ను, దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్ను పోలుస్తున్నారు. ప్రపంచ క్రికెట్ లో గ్రేట్ లీడర్ గా కూడా విరాట్ చరిత్ర సృష్టిస్తాడని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ తరుణంలో తమ జట్టుకూ ఓ  విరాట్ కోహ్లిలాంటి ఆటగాడు ఉన్నాడంటూ పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ తాజాగా స్పష్టం చేశాడు. గతేడాది వన్డేల్లో అరంగేట్రం చేసిన పాక్ క్రికెటర్ బాబర్ అజమ్ను విరాట్తో పోల్చాడు.

'మా యువ బుల్లెట్ బాబర్ అజమ్. అతనొక అసాధారణ ఆటగాడు. భారత జట్టులో విరాట్ ఎంత కీలక ఆటగాడో అదే తరహాలో బాబర్ అజమ్ కూడా  పాక్ కు ముఖ్యమైన క్రికెటర్. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్కు సరితూగే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది బాబర్ అజమ్.  ఈ విషయాన్ని ముందుగా ఊహించి చెబుతున్నా' అని ఆర్థర్ తెలిపాడు. గతేడాది అంతర్జాతీ వన్డేల్లో ప్రవేశించిన బాబర్ అజమ్.. ఇప్పటివరకూ 18 మ్యాచ్లు ఆడాడు. ఇందులో మూడు సెంచరీలు నమోదు చేయగా, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. మరొవైపు టెస్టుల్లో ఈ ఏడాది అజమ్ అరంగేట్రం చేసి మూడు మ్యాచ్లు ఆడాడు. ఇక్కడ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో 90 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Mickey Arthur  joe root  de cock  england  south africa  india  pakistan  Babar Azam  cricket  

Other Articles