బ్రిటీష్ మీడియాపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ Kohli laughs off ball-tampering charges

Ball tampering allegations just to take focus away from series says kohli

virat kohli, england media, Faf du Plessis, second test, bcci, visakhapatnam, Virat Kohli, India v England, Rajkot, Team India, England cricket, Gautam Gambhir, India, Joe Root, Murali Vijay, Rajkot, Ravichandran Ashwin, Sports, Virat Kohli, Umesh Yadav, India cricket

India Test captain Virat Kohli rubbished the allegations saying that it is an attempt to take the focus away from the series and a British tabloid article doesn't matter over ICC's decision.

బాల్ ట్యాంపరింగ్ అరోపణలపై కోహ్లీ...

Posted: 11/25/2016 05:53 PM IST
Ball tampering allegations just to take focus away from series says kohli

సుదీర్ఘ భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తో జరిగిన రాజ్ కోట్ తొలి టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడ‌ని బ్రిటీష్ మీడియా ప్రచురించిన కథనాలపై టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ విషయమై మొహాలీ వేదకగా ప్రారంభం కానున్న మూడవ టెస్టు ముందురోజు అయన నవ్వుతూ అరోపణలను తోసిపుచ్చారు. తరువాత ఈ అంశంపై ఘాటుగా స్పందించాడు.

ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడుతున్న సిరీస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇటువంటి క‌థ‌నాలను ప్రచారం చేస్తున్నార‌ని ఆరోపించాడు. త‌న‌కు వార్తా ప‌త్రిక‌లు చదివే అలవాటు లేదని.. అందుకనే బ్రీటీస్ టాబ్లాయిడ్ ది డయిలీ మెయిల్ కథనం గురించి తనకు అలస్యంగా తెలిసిందని అన్నారు.

ఇరు జ‌ట్ల మ‌ధ్య ఎంతో ఉత్కంఠ‌తో కొన‌సాగుతున్న సిరీస్‌పై నుంచి దృష్టిని మరల్చేందుకే వారు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నార‌ని అర్థం అవుతుందని వ్యాఖ్యానించాడు. ఈ అంశంపై ఇంగ్లండ్ ఆట‌గాళ్లు కానీ, అంపైర్లుగానీ ఎటువంటి ఫిర్యాదులు చేయ‌లేదు. ఈ విష‌యాన్ని గుర్తు చేసిన కోహ్లీ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన‌ కథనం ఆధారంగా ఐసీసీ తనపై చర్యలు తీసుకునే అవ‌కాశం లేద‌ని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India v England  virat kohli  Faf du Plessis  bcci  ICC  Team India  cricket  

Other Articles