మళ్లీ మెరిసిన ‘సింధూ’రం.. సైనాకు తప్పిన పరాభవం.. PV Sindhu wins on mixed day for Indian shuttlers

China open badminton tournament pv sindhu wins on mixed day for indian shuttlers

Saina Nehwal, PV Sindhu, China Open Badminton, Ajay Jayaram, HS pranoy, Indian shuttlers, badminton news, badminton

To start off, it was really heartbreaking to miss out on a home series after a long time." Rahul managed to play only in the first Test against the Kiwis after which a hamstring injury ruled him out of the remainder of the series.

మళ్లీ మెరిసిన ‘సింధూ’రం.. సైనాకు తప్పిన పరాభవం..

Posted: 11/16/2016 06:56 PM IST
China open badminton tournament pv sindhu wins on mixed day for indian shuttlers

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంటులో ఒలంపిక్స్ రజతపతక విజేత సింధూరం మళ్లీ మెరిసింది. అయితే మరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ కు మాత్రం పరాజయం తప్పలేదు. ఈ టోర్నీలోని మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత మిశ్రమ ఫలితాలను అందుకుంది. సైనా నెహ్వాల్‌ ఓడిపోగా, పీవీ సింధు శుభారంభం చేసింది.

తొలి మ్యాచ్ లో పోర్న్‌టిప్‌ బురానాప్రాసెర్ట్‌సుక్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడిన సైనా 16-21, 21-19, 14-21తో పరాజయం పాలైంది. మొదటి గేమ్‌ లో వెనుబడిన సైనా రెండో గేమ్‌ లో పుంజుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ లో తడబడడంతో ఆమె పోరాటం ముగిసింది. దాదాపు గంటసేపు మ్యాచ్‌ జరిగింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకున్నాక సైనా ఆడిన తొలి టోర్నీ ఇదే.

మరో మ్యాచ్‌ లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి చియా సిన్‌ లీపై పీవీ సింధు విజయం సాధించింది. వరుస గేముల్లో సిన్‌ లీని 21-12, 21-16తో ఓడించి రెండో రౌండ్‌ లోకి దూసుకెళ్లింది. 34 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగించింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరాం, హెచ్‌ఎస్‌ ప్రణయ్ శుభారంభం చేశారు. జు సియాఉన్‌ (చైనా)పై జయరాం 21-19, 20-22, 21-17తో విజయం సాధించాడు. ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)తో తలపడిన ప్రణయ్‌ 21-13, 21-13తో గెలిచి రెండో రౌండ్‌ లోకి దూసుకెళ్లాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  PV Sindhu  China Open Badminton  Ajay Jayaram  HS pranoy  badminton  

Other Articles