అలెస్టర్ కుక్ కు అదృష్టాన్ని తీసుకోచ్చిన పాపాయి How baby luck smiled on new ‘Don’ Alastair Cook in Rajkot

How baby luck smiled on new don alastair cook in rajkot

Alastair Cook, England Captain, second daughter, Rajkot Test, India vs England, Haseeb Hameed, Alastair Cook Baby, Don Bradman, Jacques Kallis, Team India, Visakhapatnam, cricket

England skipper Alastair Cook said scoring his ninth Test century in Asia during the drawn first Test against India made the struggle of being away from his newborn baby “worthwhile”.

అలెస్టర్ కుక్ కు అదృష్టాన్ని తీసుకోచ్చిన పాపాయి

Posted: 11/16/2016 06:37 PM IST
How baby luck smiled on new don alastair cook in rajkot

తమ రంగంలో ఎంతో అనుభవం వున్నా అదృష్టం కూడా కలసిరావాలి. లేని పక్షంలో ఎంత కష్టపడినా.. ఫలితాలను అందుకోవడం కొంచెం కష్టమే. అయితే అదే అదృష్టం కలసి వచ్చిందంటే.. ఇక తాను పట్టుకున్నదంతా బంగారమే అని పెద్దలంటుంటారు. ఇది సరిగ్గా భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ విషయంలో నిజమైంది. తన రెండో కుమార్తెతో అదృష్టం కలిసొచ్చిందని ఇంగ్లండ్‌ క్రికెట్‌ టెస్టు కెప్టెన్‌ అలిస్టర్ కుక్ భావిస్తు‍న్నాడు. అమె జన్మించడంతోనే తాను గత రికార్డులను బద్దలు కోట్టానని భావిస్తున్నాడు.

అయితే అమెతో సమయాన్ని గడుపుదామని అనుకుంటే మాత్రం అందుకు ఆయనకు తీరిక లభించడం లేదు. బంగ్లాదేశ్ పర్యటన ముగియగానే భారత పర్యటన ప్రారంభం కావడంతో ఆయన ఈ స్వల్ప వ్యవధిలో కేవలం 18 గంటలు మాత్రమే కుటుంబంతో గడిపాడు. తన ముద్దుల కూతుర్ని తనివితీరా చూడకముందే భారత్‌ పర్యటనకు పయనమయ్యాడు. రాజ్ కోట్ లో జరిగిన తొలిటెస్టులో సెంచరీ సాధించి అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

టెస్టుల్లో 30 సెంచరీలు చేసి తన రికార్డు మెరుగుపరుచుకున్న కుక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేవలం 18 గంటల పాటు నా కుమార్తెను చూడడానికి సమయం చిక్కింది. ముద్దులొలికే పాపాయిని వదిలిరావడానికి చాలా కష్టపడ్డా. ఆమె పుట్టగానే అదృష్టం కలిసివచ్చి మరిన్ని పరుగులు సాధించాన’ని కుక్‌ చెప్పాడు. ఈ సందర్బంగా తనను దిగ్గజం బ్రాడ్‌మన్‌ తో పోల్చవద్దని మీడియాను కోరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alastair Cook  England Captain  second daughter  Team India  Visakhapatnam  cricket  

Other Articles