విరాట్ కోహ్లీ జన్మదినాన శుభాకాంక్షల వెల్లువ Tendulkar wishes 'shararati' Kohli on 28th birthday

Tendulkar wishes kohli on birthday calling shararati guy

Virat Kohli birthday, indian cricket, sachin tendulkar, twitter, India vs England, India, India news, India cricket, India cricket team, Cricket, India sports, India sports news, Cricket news, sports

greeting and best wishes pour in on for virat kohli on his birthday. Team india batting legend sachin tendulkar also wished kohli calling naughty boy.

విరాట్ కోహ్లీ జన్మదినాన శుభాకాంక్షల వెల్లువ

Posted: 11/05/2016 06:37 PM IST
Tendulkar wishes kohli on birthday calling shararati guy

టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇవాళ 29వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. విరాట్ సరిగ్గా 28 వసంతాలు పూర్తిచేసుకుని 29వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆయనకు అభిమానులు, సహచర క్రికెటర్లు, ప్రపంచ క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లివిరుస్తున్నాయి.  దేశానికి చెందిన అనేక మంది ప్రముఖులు విరాటుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి.. క్రికెట్ దేవుడు, టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ప్రస్తుత టీమిండియాలో కోహ్లీనే షరారతి గయ్(నాటీ బాయ్) అంటూ సచిన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. విరాట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని, అతడు ఎన్నో విజయాలు సాధించాలని సచిన్ ఆకాంక్షించాడు. బర్త్ డే బాయ్ కోహ్లీ ఎక్కడ.. ఎలా తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాడో తెలియదు కానీ.. క్రికెట్ లెజెండ్ సచిన్ విషెస్ మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ చెలరేగుతున్న కోహ్లీకి ప్రత్యేకం. ఇటీవల కోల్ కత్తాలో అడిన మ్యాచ్ లో సచిన్ వీక్షిస్తున్న సమయంలో విరాట్ అయనకు అభినందనం చేశాడు. ఆ తరువాత వచ్చిన బర్త్ డే రోజున సచిన్.. కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli birthday  indian cricket  sachin tendulkar  twitter  India vs England  cricket  

Other Articles