ఇంగ్లాండ్ తో సిరీస్ లో సీనియర్ త్రయానికి చోటు దక్కేనా.? Gambhir, Ishant likely to be picked for England series

Ind v eng fit again ishant to make a comeback toss up between gambhir and dhawan

Virat Kohli, TeamIndia, bcci, gautam gambhir, India vs England Test series, Indian squad for England series, Ishant S, shikhar dhawan, cricket news, sports, sports news, cricket

Ishant Sharma is likely to make a comeback when the national selection committee meets here tomorrow to pick the Indian team for the upcoming Test series against England commencing November 9.

ఇంగ్లాండ్ తో సిరీస్ లో సీనియర్ త్రయానికి చోటు దక్కేనా.?

Posted: 11/01/2016 07:02 PM IST
Ind v eng fit again ishant to make a comeback toss up between gambhir and dhawan

న్యూజీలాండ్ తరువాత వెనువెంటనే సుదీర్ఘ భారత పర్యటనకు వస్తున్న ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్కు సీనియర్ క్రికెటర్ల త్రయానికి అవకాశం లభిస్తుందా..? ఇప్పుడితే క్రీడాభిమానులలో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ లతో పాటు సీనియర పేస్ బౌలర్ ఇషాంత్ శర్మల త్రయానికి ఇంగ్లాండ్ తో సీరిస్ లో అవకాశం లభిస్తుందా..? అన్న ప్రశ్న క్రీడాభిమానుల మదిని తొలుస్తుంది.

రమారమి రెండేళ్ల తరువాత కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్టులో స్థానం లభించినా.. అడే అవకాశం దక్కకపోవడంతో ఇండోర్ లో తన సత్తాను చాటాడు సీనియర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్. రెండో ఇన్నింగ్స్ లో అర్థశతకాన్ని నమోదు చేసి సెలక్టర్లకు గిఫ్ట్ గా ఇచ్చాడు. న్యూజీలాండ్ తో సిరీస్ లో అడే అవకాశం లభించినా.. సురేష్ రైనా తరహాలో అరోగ్యం సహకరించక జట్టులోకి రాని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అయితే అనారోగ్యం బారి నుంచి కోలుకున్న ఈయన.. ఫిట్ నెస్ కూడా నిరూపించుకుని బరిలోకి దూకడానికి రెడీ అయ్యాడు.

దీంతో ఆయనను ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేసే అవకాశాలు మెండుగా వున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్కు జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ బుధవారం (రేపు) సమావేశమవుతోంది. ఈ నేపథ్యంలో వీరద్దరితో పాటు న్యూజీలాండ్ తో రెండో టెస్టులో గాయపడిన శిఖర్ ధావన్ లను ఎంఎస్కే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందా..? లేదా..? సీనియర్ త్రయాన్ని స్థానం కల్పిస్తుందా అన్న విషయమై సర్వత్రా అసక్తి నెలకోంది... ఈ నెల 9 నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఎవరి తుది జట్టులో స్థానం లభిస్తుంది..? ఎవరికి నిరాశ ఎదురవుతుందన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Gambhir  Ishant Sharma  Indian Cricket  England series  bcci  cricket  

Other Articles