కోహ్లీని త్వరగా ఔట్ చేయడంతోనే విజయం Dismissing Kohli early was a big step for New Zealand, says Guptill

Dismissing kohli early was a big step for new zealand says guptill

Virat Kohli, Martin Guptill, India vs New Zealand, 4th ODI, ind vs nzl, ranchi odi, india vs new zealand ranchi, martin guptill virat kohli, guptill kohli, guptill new zealand, kohli india, cricket news, sports news, cricket, sports

Martin Guptill, who won the Man of the Match for his 84-ball 72, said Virat Kohli's early dismissal paved the way for New Zealand's 19-run win against India in Ranchi.

కోహ్లీని త్వరగా ఔట్ చేయడంతోనే విజయం

Posted: 10/27/2016 01:08 PM IST
Dismissing kohli early was a big step for new zealand says guptill

పర్యాటక జట్టు న్యూజిలాండ్ తో జరిగుతున్న వన్డే సిరీస్ పై పైచేయి సాధించాలని, రాంఛీ వేదకగా సాగిన నాల్గవ వన్డే మ్యాచ్ తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న టీమిండియా ప్రయత్నాలు వీగిపోయాయి. ఈ మ్యాచ్ లో అజ్యింకా రహానే, విరాట్ కోహ్లీల మధ్య మాత్రమే కొంత వరకు పటిష్టమైన భాగస్వామ్యం నమోదైంది. ఆ తరువాత మిడిల్ అర్డర్ కానీ, అంతకు ముందు టాప్ అర్డర్ కానీ అందరూ పూర్తిగా విఫలమయ్యారు. టెయిల్ ఎండర్లు పోరాటం చేసినా.. అప్పటికే కివీస్ మ్యాచ్ పై పట్టుబిగించారు. దీంతో పర్యాటక జట్టు టీమిండియాపై 19 పరుగులతో విజయాన్ని అందుకుంది.

వన్డే సిరీస్ లో ఇరు జట్లు రెండేసి మ్యాచ్ లను గెలుపొందడంతో పాటు సిరీస్ ను సమం చేసిన తరుణంలో ఇక విశాఖ వేదికగా జరగనున్న ఐదవది, చివర వన్డే పై ఇరుజట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకోననుంది. ఈ క్రమంలో నాల్గవ టెస్టు గెలపుకు కారణం మాత్రం విరాట్ కోహ్లీని త్వరగా ఔట్ చేయడమేనంటున్నాడు అ జట్టు స్టార్ ప్లేయర్ మార్టిన్ గుప్తిల్. టీమిండియాతో మ్యాచ్ ల సందర్భంగా తొలిసారిగా అర్థశతకంతో రాణించిన గుప్తిల్ మ్యాన్ అప్ ది మ్యాచ్ ను కూడా అందుకున్నారు.

కోహ్లీని 45 పరుగుల వద్ద ఔట్ చేయడమే తమ ఆటను మలుపు తిప్పిందని అన్నాడు. అతని ఔట్ తమ జట్టు సభ్యులకు అనందాన్ని ఇచ్చిందని, దీంతో పాటు అటలో విజయంపై కూడా అశలు రేపిందన్నాడు. విరాట్ క్లాస్ అటగాడు అతన్ని త్వరగా పెవీలియన్ పంపడం ప్రత్యర్థి జట్టుకు అనందమే కదా.. అని అన్నాడు. ఇక ఆ తరువాత మ్యాచ్ పై తమ వాళ్లు పట్టుబిగించారని లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ చేసి విజయాన్ని అందకున్నామన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  Virat Kohli  Martin Guptill  cricket  

Other Articles