ద్రావిడ్ చేతిలో పడి మరింత మెరుగయ్యా: సంజు సామ్ సన్ Sanju Samson credits mentor Rahul Dravid for growth

Sanju samson credits mentor rahul dravid for growth

sanju samson, samson, sanju samson india, sanju samson india a, sanju samson ipl, rahul dravid, dravid, jammy, cricket, cricket news, sports, sports news

Rahul Dravid, India A coach, has had the biggest influence on Sanju Samson, who came into the limelight for Rajasthan Royals outfit in IPL 2013.

రాహుల్ వల్లే నాకు ఈ స్థితి: సంజు సామ్ సన్

Posted: 10/08/2016 02:07 PM IST
Sanju samson credits mentor rahul dravid for growth

టీమిండియా ది వాల్ గా ఖ్యాతికెక్కిన ఇండియా 'A' జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి అందరికీ తెలిసిందే. తన పనేదో తనది అన్నట్లుగా వుంటూనే తన పనిలో మాత్రం ఎలాంటి పోరబాట్లు లేకుండా చేసుకోవడం అయన అలవాడు. ఆయన చేతిలో పడితే చాలు ఎలాంటి అవరోధానైన్నా అధిగమించే శక్తి, నైపుణ్యం, ధైర్యం యువ క్రీడాకారులకు వస్తాయన్నది వారి భావన. టీమిండియా ప్రధాన కోచ్ గా తనకు అందివచ్చిన అవకాశాన్ని కూడా కాదని తనకు అంతకుముందు దక్కిన ఏ జట్లు కోచ్ గానే తాను తృప్తిగా వున్నానని చెప్పిన ధీరుడ ద్రావిడ్.

ఇప్పడీ విషయాన్ని దైర్యంగా అంగీకరిస్తున్నాడు యువ క్రికెటర్. ద్రావిడ్ శిక్షణలో తాను మరింతగా రాటు తేలానని, అయన నేర్పించిన టెక్నిక్స్ వల్లే తాను మంచి క్రికెటర్ గా తయారయ్యానని కేరళ వర్ధమాన క్రికెటర్ సంజు శాంసన్ తెలిపాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్ము కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌ లో తొలిరోజు 142 పరుగులతో అజేయంగా నిలిచిన శాంసన్‌ మాట్లాడుతూ, ద్రవిడ్ తో గడిపే ప్రతిక్షణం ఎంతో విలువైనదని అన్నాడు. ఆయన నుంచి ఎంతో నేర్చుకుంటామని చెప్పాడు.

ఆయన సాహచర్యాన్ని ప్రతి క్రికెటర్ ఎంతగానో ఆస్వాదిస్తాడని తెలిపాడు. ఇండియా 'ఎ' జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రతి ఆటగాడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాడని తెలిపాడు. క్రీజులో అడుగుపెట్టిన తరువాత పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ద్రవిడ్ సూచించాడని, బౌలర్‌ కూడా వికెట్లు తీయాలని సన్నద్ధమై వస్తాడని, అందుకే వారిని గౌరవించాలని ద్రవిడ్‌ ఎప్పుడూ చెబుతుంటాడని సంజు శాంసన్ చెప్పాడు. కాగా, ద్రవిడ్ సారధ్యంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కు సంజు శాంసన్ ప్రాతినిధ్యం వహించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanju samson  rahul dravid  mentor  indian A team  cricket  

Other Articles