టీమిండియా పెళ్లికాని ప్రసాదు.. ఇంటివాడు కాబోతున్నాడు.. Cricketer Yuvraj Singh To Tie The Knot In November

Cricketer yuvraj singh to tie the knot in november

Yuvraj Singh, Hazel Keech, Yuvraj wedding, Hazel Keech wedding, Team India, Indian cricket, Yuvraj Singh, Hazel Keech, cricket, cricket news, sports, sports news

Indian cricketer Yuvraj Singh is all set to tie the knot with Bollywood actress Hazel Keech soon. According to reports, the couple will get married on November 30 in Yuvraj's hometown.

పెళ్లికాని ప్రసాదు ఇంట్లో త్వరలో పెళ్లిబాజాలు..

Posted: 09/28/2016 04:31 PM IST
Cricketer yuvraj singh to tie the knot in november

టీమిండియా క్రికెట్ లో వెటరన్ అటగాడిగా తన సీనియారిటీ బట్టి చెప్పేసేది ఎవర అందరికీ తెలిసిందే. అయన మరెవరో కాదు. డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. ఇప్పుడాయన వెటరన్ అన్న అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు అనేగా మీ సందేహం. రవీంద్ర జెడేజా, రవించంద్రన్ అశ్వాన్ లాంటి జూనియర్లు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఇంకా పెళ్లి కాని ప్రసాదుగా మిగిలిపోయిన యువరాజ్ సింగ్ ను మరేమనాలో తెలియక..? ఇలా అన్నాంలేండి. ఇక ఆయన సహచర క్రికెటర్లు ఏకంగా పెళ్లిళ్తు చేసుకుని పిల్లాపాపలతో హాయింగా ఎంజాయ్ చేస్తుంటే.. ఈయన గారు మాత్రం గతేడాది పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చాడు. అది కూడా సహచర క్రికెటర్ భజ్జీ ట్విట్ తో విషయం వెలుగులోకి వచ్చింది.  

అయితే గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న యువరాజ్ సుమారుగా ఏడాది పాటు తన ప్రియురాలితో ఎంజాయ్ చేసిన తరువాత రానున్న నవంబర్ మాసంలో అమెను తన సహధర్మచారిణిగా చేసుకోనున్నాడు. ఇంతకీ అయన ప్రేయసి ఎవరనేగా, ఆమె బాలీవుడ్ నటి హజెల్ కీచ్. నవంబర్ లో అమె చేతిని పట్టుకుని పాణిగ్రహణం చేసుకోబోతున్న యువరాజ్ ఈ విషయాన్ని గోప్యంగా వుంచినా.. జాతీయ మీడియా మాత్రం వాసనను పట్టేసింది. నవంబర్ 30న వీరిద్దరి పెళ్లి జరగనున్నట్టు వార్తలు వచ్చాయి.

డిసెంబర్ 5, 7 తేదీల మధ్య రిసెప్షన్ జరగనుంది. యువరాజ్, హజెల్ కీచ్ చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది నవంబర్లో బాలిలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. యువరాజ్ ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా రెడ్ జట్టుకు నాయకత్వం వహించాడు.  ప్రస్తుతానికి క్రికెట్కు సంబంధించిన షెడ్యూల్ లేదు. బ్రిటన్కు చెందిన హజెల్ పలు టీవీ కార్యక్రమాలు, సినిమాల్లో నటించింది. దక్షిణాది సినిమాల్లో కూడా ఆమె కనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Indian cricket  Yuvraj Singh  Hazel Keech  cricket  

Other Articles