చారిత్రాత్మక టెస్టుకు ఇషాంత్ దూరం.. వెంటాడిన అనారోగ్యం Ishant Sharma ruled out of Kanpur Test

Ishant sharma ruled out of kanpur test

india, india vs new zealand, india new zealand tests, india new zealand kanpur, ishant sharma, ishant sharma chikungunya, cricket, cricket news, sports, sports news

Ishant Sharma has failed to recover from chikungunya and will miss the first Test that begins at Green Park Stadium on Thursday.

చారిత్రాత్మక టెస్టుకు ఇషాంత్ దూరం.. వెంటాడిన అనారోగ్యం

Posted: 09/20/2016 08:37 PM IST
Ishant sharma ruled out of kanpur test

టీమిండియా క్రికెట్ ప్రతిష్టాత్మకమైన 500వ టెస్టు మ్యాచ్ ఈ నెల 22న కాన్పూరులో న్యూజిలాండ్‌తో జరగనున్న తరుణంలో అందులో అడే అదృష్టాన్ని టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కోల్పోనున్నాడు. అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టుకు ఇషాంత్ దూరమయ్యాడు. చికెన్ గున్యా బారిన పడడంతో అతడు చరిత్రాక టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. అతడి స్థానంలో మరో బౌలర్ కావాలని కోచ్ అనిల్ కుంబ్లే అడగలేదు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ జట్టులో ఉన్నారు.

న్యూజిలాండ్ జట్టులోనూ ఆల్ రౌండర్ జేమ్స్ నిషామ్ పక్క ఎముక గాయం కారణంగా కాన్పూర్ టెస్టుకు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన సౌతీ వన్డే సిరీస్ లో బరిలో దిగే అవకాశముంది. 72 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ 36.71 సగటుతో 209 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో అతడు 8 వికెట్లు తీశాడు. ఈ నెల 22నుంచి న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగే టెస్టు టీమిండియాకు 500వ మ్యాచ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Ishant Sharma  chikungunya  Kanpur Test Match  500th test match  cricket  

Other Articles