Former Australian cricketer, wicket keeper Len Maddocks dies at 90

Former australia wicketkeeper len maddocks passes away

Len Maddocks, Australia, Former cricketer, former aussie wicket keeper, Dead at 90, CA, Cricket australia, cricket, cricket news, sports, sports news

Len Maddocks, who played seven Test matches between 1954 and 1956 was Australia's oldest surviving cricketer.

అలనాటి అసీస్ వికెట్ కీపర్ లెన్ మాడోక్స్ ఇకలేరు..

Posted: 09/02/2016 07:28 PM IST
Former australia wicketkeeper len maddocks passes away

ఆస్ట్రేలియా పాతతరం క్రికెటర్ లెన్ మాడోక్స్(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లెన్ మాడోక్స్  మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.  1954 నుంచి 1956 మధ్యకాలంలో అటు బ్యాట్స్మన్గా, ఇటు వికెట్ కీపర్గా  ఆసీస్ తరపున బాధ్యతలు నిర్వర్తించిన మాడోక్స్ .. అతని  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో  ఏడు టెస్టు మ్యాచ్లు ఆడారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో విక్టోరియా, తస్మానియా జట్లకు ప్రాతినిధ్యం వహించిన మాడొక్స్ 117 మ్యాచ్ లు ఆడారు.

దాంతోపాటు ఆసీస్ జాతీయ సెలక్టర్గా కూడా పని చేసిన లెన్ మాడోక్స్... 1977లో ఇంగ్లండ్లో పర్యటించిన ఆసీస్ జట్టుకు మేనేజర్గా వ్యవరించారు. లెన్ మాడోక్స్పై క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మాడోక్స్ చేసిన సేవలు అనిర్వచనీయమని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సౌథర్లాండ్ కొనియాడారు. ఈ వారంలో ఆస్ట్రేలియా క్రికెట్ కు ఇది అత్యంత విషాదకరమైన వార్త అని సౌథర్లాండ్ సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Len Maddocks  australia  Cricket Australia  cricket  

Other Articles