Sarfaraz Ahmed upsets the status quo as he hits home 'boring' century in second ODI

Shoaib akhtar reveals most dangerous batsman in cricket

pakistan, Inzamam-ul-Haq, Shoaib Akhtar, Sachin Tendulkar, Brain Lara, Ricky Ponting, cricket

Former Pakistani speedster Shoaib Akhtar had a surprise up his sleeve, when asked who was the most difficult batsman he had ever bowled to, in an interview

షోయబ్ అక్తర్ వితండవాదన.. గ్రేట్ బ్యాట్స్ మెన్ అంటే హకేనట

Posted: 08/31/2016 06:52 PM IST
Shoaib akhtar reveals most dangerous batsman in cricket

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ దేవుడు, భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ తన దృష్టిలో అంత గొప్ప ఆటగాళ్లు కారని పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడిన దశకంలో ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న షోయబ్ అక్తర్ బెస్ట్ బ్యాట్స్ మన్ ఈ ముగ్గురిలో ఎవరూ కాదని అభిప్రాయపడ్డాడు. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టాక్ షో లో పాల్గొన్న సందర్భంగా షోయబ్ ఈ విషయాలను వెల్లడించాడు.

'ప్రపంచంలో చాలా మంది గొప్ప బ్యాట్స్ మన్లు ఉన్నప్పటికీ చాలా కష్టమైనా సరే వారిని ఏదో విధంగా ఔట్ చేయగలిగాను. కానీ, తన సహచరుడు, అప్పట్లో జట్టు కెప్టెన్ అయిన ఇంజమామ్ ఉల్ హక్ ను ఔట్ చేయడం చాలా కష్టం. కనీసం నెట్స్ లో ఒక్కసారి కూడా  ఇంజీని ఔట్ చేయలేకపోయాను' అని అక్తర్ వెల్లడించాడు. అతడి ఫుట్ వర్క్ చాలా అద్భుతంగా ఉండటంతో తన బంతిని కచ్చితంగా అంచనా వేసేవాడన్నాడు. అందుకే తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో ఇంజమామ్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని, అతడితో సరితూగే బ్యాట్స్ లేడని.. ఎవరితోనూ అతడిని పోల్చలేమని అక్తర్ కొనియాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  Inzamam-ul-Haq  Shoaib Akhtar  Sachin Tendulkar  Brain Lara  Ricky Ponting  cricket  

Other Articles