KL Rahul Smashes Joint Second-Fastest Century

Kl rahul hits fastest t20i century by an indian

India vs West Indies, India vs West Indies T20 in Florida, KL Rahul, Team India in USA, cricket news, cricket

KL Rahul scored the fastest century by an Indian batsman in Twenty20 international cricket but couldn’t guide India past West Indies’ score

కెఎల్ రాహుల్ రికార్డులు.. మూడు ఫార్మెట్ లలోనూ శతకాలు..

Posted: 08/28/2016 11:53 AM IST
Kl rahul hits fastest t20i century by an indian

వెస్టిండీస్ తో జరిగిన తొలి టి20లో ఫస్ట్ సెంచరీ బాదిన టీమిండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ పలు ఘనతలు సాధించాడు. టి20లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగాడ్లుప్లెసిస్ (దక్షిణాఫ్రికా) తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. 46 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో రాహుల్ తొలి టి20 శతకం పూర్తిచేశాడు. టి20లో వేగవంతమై సెంచరీ రికార్డు రిచర్డ్‌ లెవి (దక్షిణాఫ్రికా) పేరిట ఉంది. అతడు 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు.

భారత్ తరఫున టి20ల్లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్ గా ఘనతకెక్కాడు. అతడి కంటే ముందు రోహిత్ శర్మ, రైనా ఒక్కో సెంచరీ చేశారు. అంతేకాదు సురేశ్‌ రైనా తర్వాత మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు. మరోవైపు మూడు ఫార్మాట్లలోనూ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రాహుల్‌ రికార్డు సృష్టించడం మరో విశేషం.

అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు రాహుల్(110)దే కావడం మరో విశేషం. అంతకుముందు  దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ నమోదు చేసిన 106 పరుగులే అంతర్జాతీయ టీ 20ల్లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు. విండీస్ తో జరిగిన తొలి టి20లో ధోని సేన పోరాడి ఓడినా.. రాహుల్ సునామీ ఇన్నింగ్స్  మన్ననలు అందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KL Rahul  Second-Fastest t20 Century  Lauderhill  cricket  

Other Articles