నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ లో పర్యటిస్తున్న టీమిండియా మూడవ టెస్టులో రాణించేందుకు అపసోపాలు పడింది. అదిలోనే వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాలలో పడగా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాటును ఝుళిపించాడు. వృద్దిమాన్ సహాతో కలసి ఏకంగా అజేయ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో అశ్విన్ నిజంగా ఆల్ రౌండరని మరోమారు రుజువు చేసుకున్నాడు. వెస్టిండిస్ టూర్ లో బౌలింగ్ తోనే కాకుండా బ్యాటుతోనూ సత్తా చాటుతున్న అశ్విన్ తన కెరీర్ లోనే తొలి సెంచరీని నమోదు చేశాడు.
తాజాగా క్రితం రోజు ప్రారంభమైన మూడో టెస్టులో టాపార్డర్ వరుసగా పెవిలియన్ చేరినా, అశ్విన్ (75 నాటౌట్) మాత్రం నిలబడి జట్టును ఆదుకున్నాడు. అజింక్య రహానేతో కలసి బ్యాటింగ్ చేసిన అశ్విన్.. పరుగులను రాబట్టడంతో సక్సెస్ అయ్యాడు. కాగా టీ విరామానికి ముందు రహానే పెవీలియన్ మార్గం పట్టగా, ఆ తరువాత వచ్చిన సాహాతో కలసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ సేన 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అశ్విన్, వృద్ధిమాన్ సాహా (46) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు వెస్టిండిస్... పర్యాటక జట్టు టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్లు మెరవడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా... మూడో టెస్టులో మాత్రం విండీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడింది. ఫలితంగా 87 పరుగులకే నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ జట్టును ఆదుకున్నాడు. రెహానేతో కలిసి విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన అశ్విన్.. రెహానే ఔటైన తర్వాత సాహాతో కలిసి జట్టు స్కోరును పరుగు పెట్టించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more