Sri Lanka win series opener after spinners demolish Australian batting

Kusal mendis rangana herath power hosts to 106 run win

Rangana herath, kusal mendis, MA Starc, kusal mendis score, kusal mendis test hundred, kusal mendis runs, kusal mendis sri lanka, kusal mendis sri lanka vs australia, dinesh chandimal, kusal mendis partnership, australia vs sri lanka, sri vs aus, sri vs aus, aus vs sri, cricekt, cricket score, cricket, sports news, sports

Sri Lankan spinner Rangana Herath backed up centurion Kusal Mendis' superlative effort to stun top-ranked Australia by 106 runs in the rain-affected first Test in Pallekele

తొలి టెస్టులో 106 పరుగులతో అసీస్ ను చిత్తుచేసిన లంక

Posted: 07/30/2016 07:52 PM IST
Kusal mendis rangana herath power hosts to 106 run win

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో పల్లెకిలా వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో శ్రీలంక నిర్ధేశించిన 268 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన అసీస్ జట్టు లంక స్పీనర్ల ముందు మోకరిల్లారు. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో లంకేయులు స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించి అద్భుతమైన గెలుపును సొంతం చేసుకున్నారు. ఫలితంగా తొలిటెస్టులో లంక అసీస్ పై 106 పరుగులతో విజయాన్ని అందుకుంది. ప్రత్యేకంగా లంకేయుల గెలుపులో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు.

స్పిన్నర్ రంగనా హెరాత్ ఐదు వికెట్లు సాధించి ఆసీస్ పతనాన్ని శాసించగా, మరో స్పిన్నర్ లక్షాన్ సందాకాన్ మూడు వికెట్లు తీసి ఆసీస్ను కోలుకోనీయకుండా చేశాడు. శ్రీలంక విసిరిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన ఆసీస్ 106 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.  83/3 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 161 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ స్టీవ్ స్మిత్(55) రాణించగా, మిచెల్ మార్ష్(25) ,బర్న్స్(29) మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. మిగతా  ఆటగాళ్లు ఘోరంగా వైఫల్యం చెందడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు.
 
చివరి రోజు ఆటలో 140 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ను ఐదో వికెట్గా అవుటైన అనంతరం ఆసీస్ పతనం ఆరంభమైంది. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన ఆసీస్ ఏ దశలోనూ ఆకట్టుకోలేక చతికిలబడింది. ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఆసీస్కు పరాజయం ఎదురైంది. దీంతో సిరీస్ లో శ్రీలంక 1-0 ఆధిక్యం సాధించింది. లంకేయులు రెండో ఇన్నింగ్స్ లో భారీ సెంచరీతో ఆకట్టుకున్న కుశాల్ మెండిస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్ లో నమొదైన పలు రికార్డులు..

*    ఈ మ్యాచ్‌తో 17 ఏళ్ల తర్వాత ఆసిస్‌పై శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ గెలిచినట్టైంది. 1999 సెప్టెంబర్ లో ఆసిస్‌పై గెలిచిన తరువాత నుంచి జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో 10 ఓడిపోయి 3 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది శ్రీలంక.
*    ఈ ఓటమితో ఆసియా ఖండంలో వరుసగా 7 ఓటములను చవిచూసింది ఆస్ట్రేలియా. 2013లో భారత్‌పై 4 మ్యాచ్‌లను ఓడిపోగా, 2014/15లో రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్‌పై ఓడిపోయింది.
*    శ్రీలంకలో ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఎక్కువ ఎల్‌బిడబ్ల్యూ ఔట్‌లు నమోదయ్యింది ఈ మ్యాచ్‌లోనే. మొత్తం 15 వికెట్లు ఈ విధంగానే పడ్డాయి.
*    పల్లెకెల్ మైదానంలో కుశాల్ మెండిస్ చేసిన 176 పరుగులే అత్యధికమైనవి. ఆసిస్‌పై ఇది రెండో అత్యుత్తమ స్కోర్. అంతకుముందు 2008లో కుమార సంగార్కర 192 పరుగులు చేశాడు.
*    ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా జట్టుపై వరుసగా 25 మేడిన్ ఓవర్లు వేసిన జట్టుగా శ్రీలంక నిలిచింది.
*    ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన రంగనా హెరాత్ మొత్తం 24 సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ఇది శ్రీలంక క్రికెట్ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
*    ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక చేసిన 117 పరుగులు టెస్ట్ మ్యాచ్‌లలో రెండో అత్యల్ప స్కోర్.

స్కోరు వివరాలు:

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 117 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 353 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 203 ఆలౌట్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 161 ఆలౌట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangana herath  kusal mendis  Sri Lanka  pallekele Test  Australia  Sri Lanka  cricket  

Other Articles