BCCI given six months to implement Lodha committee reforms

We respect supreme court s verdict says rajeev shukla

supreme court, sc, supreme court lodha panel, supreme court bcci, supreme court verdict bcci, sc lodha panel, lodha panel rajiv shukla, rajiv shukla, r m lodha panel, cricket, bcci, sports, sports news, sports, cricket news, cricket

The BCCI respects Supreme Court’s verdict on sweeping reforms in the cricket board and it will work towards implementing the recommendations made by the Lodha panel, senior BCCI functionary and IPL chairman Rajeev Shukla said.

సుప్రీం అమోదించిన లోధా సిఫార్సులపైనే దృష్టి

Posted: 07/18/2016 07:56 PM IST
We respect supreme court s verdict says rajeev shukla

జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదించిన సిఫార్సులను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు మాసాల వ్యవధిలోపు లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని సూచించింది. ఈ కమిటీ సిఫార్సులలో అత్యంత ముఖ్యమైనవి భావిస్తున్న రెండు సిఫార్సుల అమలుతో బీసిసిఐ పగ్గాలను అందుకోవాలని ఉబలాపడే రాజకీయ నేతల అశలు.. ఇకపై అడియాశలయినట్లే. ముఖ్యంగా బీసీసీఐ ఛీప్ పదవికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను ఎంపిక చేయడం పట్ల సుప్రీం చెక్ పెట్టింది. అంతేకాదు 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పదవికి అర్హులు కాదని తేల్చిచెప్పింది.

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాము గౌరవపూర్వకంగా స్వీకరిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్ కోశాధికారి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే లోథా కమిటీ ప్రతిపాదనలను ఏ రకంగా అమలు చేయాలనే దానిపై ప్రధాన దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. 'సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం. లోథా కమిటీ కొన్ని ప్రతిపాదనలు సూచించింది. ఆ ప్రతిపాదనల్లో చాలా వాటిని సుప్రీం ఆమోదించింది. వాటిని అమలు చేయడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళతాం. అయితే ఎలా అమలు చేయాలి అనే దానిపై త్వరలో కార్యచరణ రూపొందిస్తాం' అని శుక్లా పేర్కొన్నారు.

బీసీసీఐ ప్రక్షాళనలో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఏర్పాటైన జస్టిస్ లోథా కమిటీ అనేక ప్రతిపాదనలను సూచించింది. అయితే దీనిపై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసిన బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  దీనిలో భాగంగా సోమవారం మరోసారి బీసీసీఐ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం.. దాదాపులోథా కమిటీ సూచించిన అన్ని ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆరు నెలల్లో క్రికెట్ను  ప్రక్షాళన చేయాలని బీసీసీఐకు సూచించిన సుప్రీం.. క్రికెట్ కు రాజకీయ నేతలకు దూరంగా ఉండాలని తీర్పులో స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  rajiv shukla  BCCI  lodha panel  cricket  

Other Articles