Pink Ball Test can wait says indian head coach Anil Kumble

Pink ball test still has a long way to go says anil kumble

anil kumble, kumble, virat kohli, kohli, Day-night Tests, Pink ball, bcci, india vs west indies, ind vs wi, india tour of west indies, india vs west indies 2016, cricket news, cricket

Anil Kumble, the head coach of the Indian cricket team, has expressed his apprehensions about playing with the pink ball

డే నైట్ మ్యాచులతో ఆసక్తికరంగా టెస్టు మ్యాచ్ లు

Posted: 07/06/2016 07:46 PM IST
Pink ball test still has a long way to go says anil kumble

ఐదు రోజుల ఫార్మాట్‌పై అభిమానుల ఆసక్తిని కొనసాగించాలంటే భవిష్యత్‌లో డేనైట్ టెస్టులు తప్పవని భారత చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. అయితే పింక్ బంతితో నిర్వహించే ఈ మ్యాచ్‌లకు మరింత సమయం పడుతుందన్నారు. ‘మేం పింక్ బంతుల గురించి ఇంకా ఆలోచించలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది. వెస్టిండీస్‌లో మాత్రం మేం రెడ్ డ్యూక్ బంతులతోనే ఆడతాం. డేనైట్ టెస్టులకు నేను కూడా మద్దతిస్తున్నా.

ఏదేమైనా భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు ప్రేక్షకాదరణ పెంపొందించాలి. డేనైట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రజలు ఆఫీస్ పని వేళలు ముగించుకుని స్టేడియానికి వస్తారు’ అని కుంబ్లే పేర్కొన్నారు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చిన కుంబ్లే... అతనితో కలిసి పని చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india cricket team  anil kumble  Day-night Tests  Pink ball  bcci  cricket  

Other Articles