Virat Kohli fails Anil Kumble's One-hour challenge, Ajinkya Rahane the only one to survive

Theme for virat kohli led india all for one and one for all

india cricket team, virat kohli, kohli, anil kumble, kumble, india vs west indies, india vs west indies 2016, india tour of west indies 2016, cricket news, cricket

Ahead of leaving for the Test tour of West Indies, ‘building emotional bonds’ has been the focus for Virat Kohli and boys.

అనిల్ కుంబ్లే పరీక్షలో కోహ్లీ ఫెయిల్

Posted: 07/05/2016 07:30 PM IST
Theme for virat kohli led india all for one and one for all

టీమిండియా ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే పెట్టిన పరీక్షలో అజింక్య రహానే మినహా టీమిండియా మొత్తం ప్లేయర్లు విఫలయమయ్యారు. ముఖ్యంగా టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పరీక్షలో రెండు పర్యాయాలు విఫలమయ్యారు. అంటే కుంబ్లే అంతటి కఠిన పరీక్ష పెట్టారా? అంటే... అదేమీ లేదు గాని ప్రాక్టీస్ సెషన్ లో టెస్టు మ్యాచ్ లో కట్టుకునే ప్యాడ్లతో బరిలోకి దిగమన్నాడు. అంతేకాదు, గంట పాటు ఔట్ కాకుండా బంతులను ఎదుర్కోవాలని సూచించాడు. అయితే ఈ గంట పాటు కూడా కోహ్లీ క్రీజులో నిలబడలేకపోయాడు.

ప్రాక్టీస్ సెషన్ లో కాకుండా ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లలోనే కోహ్లీ గంటల తరబడి ఏకధాటి ఇన్నింగ్ ఆడిన సందర్భాలున్నాయి. మరి కుంబ్లే పెట్టిన పోటీలో కోహ్లీ ఎందుకు నిలబడలేకపోయాడు? వివరాల్లోకెళితే... వెస్టిండిస్ టూర్ కు ముందు నిన్న ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టిన టీమిండియా సభ్యులతో తొలిరోజు యోగాసనాలు వేయించిన కుంబ్లే... రెండో రోజు ఉదయం వారందరినీ బెంగళూరుకు 40 కిలో మీటర్ల దూరంలోని ఆలూరుకు తీసుకెళ్లాడు.

అక్కడ టెస్టు మ్యాచ్ లలో కట్టుకునే ప్యాడ్లిచ్చి రంగంలోకి దించాడు. గంట పాటు ఔట్ కాకుండా ఆడాలని ఓ పోటీ పెట్టాడు. అదే సమయంలో వీలయినన్ని ఎక్కువ వికెట్లు పడగొట్టాలని బౌలర్లను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్ కు బోల్తా పడ్డ కోహ్లీ... అతడి బౌలింగ్ లోనే కేవలం గంట వ్యవధిలో రెండు సార్లు ఔటయ్యాడు. ఇక ఓపెనర్లుగా సత్తా చాటుతున్న శిఖర్ ధావన్, మురళీ విజయ్ లు కూడా కేవలం గంట పాటు క్రీజులో నిలబడలేకపోయారు. ఒక్క అజింక్యా రెహానే మినహా ఏ ఒక్కరు కూడా కుంబ్లే ‘గంట’ పరీక్షలో నెట్టుకురాలేకపోయారట.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india cricket team  virat kohli  kohli  anil kumble  ajinkya rahane  bcci  cricket  

Other Articles