Barinder Sran credits Ashish Nehra, Bhuvneshwar Kumar for successful Zimbabwe outing

Conditions ipl experience help sran rediscover swing

barinder sran, sran, sran bowling, sran vs zimbabwe, barinder sran india, india barinder sran, sran cricket, barinder sran cricket, cricket india, india cricket, cricket

Promising left-arm seamer Barinder Sran on Friday credited senior pros Ashish Nehra and Bhuvneshwar Kumar for his successful outing during the ODI against Zimbabwe.

వాళ్ల సలహాలో బౌలింగ్ లో రాటు తేలాను..

Posted: 06/18/2016 01:53 PM IST
Conditions ipl experience help sran rediscover swing

తన పేస్ బౌలింగ్ మరింత మెరుపడ్డానికి టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా, సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్లే కారణమంటున్నాడు యువ బౌలర్ బరిందర్ శ్రవణ్.  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆ ఇద్దరి బౌలర్ల నుంచి కొన్ని మెళకువలు నేర్చుకోవడం వల్లే తన ప్రదర్శన మెరుగుపడిందని తాజాగా స్పష్టం చేశాడు. 'ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు జట్టుకు ఆడే క్రమంలో  మేము ముగ్గురం అనేక విషయాలు షేర్ చేసుకున్నాం.  వారు సీనియర్లు కావడంతో నాకు చాలా సలహాలిచ్చారని తెలిపాడు. ప్రత్యేకంగా సీమ్ పొజిషన్ పై వారు తనకు కొన్ని అమూల్యమైన సలహాలిచ్చారన్నాడు.

అదే తనకు ఇప్పుడు ఉపయోగపడిందని చెప్పుకోచ్చాడు శ్రవణ్. ఏ విధమైన సందేహాన్ని అడిగినా వారిద్దరూ ఎంతో సహనంతో తనకు సహకరించేవారని, డౌట్ అన్నది లేకుండా చేశారని కొనియాడాడు. ప్రస్తుతం తన సీమ్ బౌలింగ్ పొజిషన్ ను  కొద్దిగా మార్చుకోవడానికి వారిద్దరే ప్రధాన కారణమన్నాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం కోసమే స్వల్ప మార్పులు చేసుకున్నట్లు తెలిపాడు. తన జింబాబ్వే పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రవణ్.. ఇంకా తాను ఫిట్ నెస్ పరంగా, బౌలింగ్ పరంగా ఇంకా చాలా  మెరుగపడాల్సి ఉందని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  zimbamwe  ind vs zim 2016  Barinder Sran  Ashish Nehra  Bhuvneshwar  cricket  

Other Articles