MS Dhoni rides Harare policeman's bike on Zimbabwe tour 2016

Ms dhoni rides policeman s bike

india vs zimbabwe 2016, mahendra singh dhoni, bike ride, police bike, india, zimbabwe, cricket, team india, bike, india tour of zimbabwe 2016, policeman, harare

Team India's limited overs' skipper MS Dhoni's passion for sports cars and bikes is not hidden from anyone.

జింబాబ్వేలో సరదాగా పోలిస్ బైక్ నడిపిన కెప్టెన్ కూల్..

Posted: 06/16/2016 09:09 PM IST
Ms dhoni rides policeman s bike

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్లంటే మహా పిచ్చి. వినూత్నంగా ఏ బైక్ కనిపించినా దానిని రైడ్ చేసి తన మోజు తీర్చుకోవాల్సిందే. అయితే 11 ఏళ్ల తరువాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన  ధోని.. ఈసారి పోలీస్ బైక్ను నడిపి తన ముచ్చట తీర్చుకున్నాడు.  మూడో వన్డేకు ముందు స్థానికి పోలీస్ అధికారి వద్ద నుంచి బైక్ తీసుకున్న ధోని రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టాడు. రూ.10.50 లక్షల విలువైన కవాసకీ కాంటోర్స్ 14 ఏబీఎస్ బైక్ ను హరారే మైదానంలోనే పరుగులు పెట్టించాడు.

ఇప్పటికే భారత్ లో ధోనికి ఓ కవాసీ  బైక్ ఉండటంతో అదే కంపెనీకి చెందిన కాంటోర్స్ను ధోని అలవోకగా నడిపాడు. ఈ మేరకు బైక్ పై ఉన్న ఫోటోను తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ లో ధోని పోస్ట్ చేశాడు. ధోని బైక్ కలెక్షన్ లో పలు ప్రముఖ కంపెనీకి చెందిన బైక్లను కల్గి ఉన్న సంగతి తెలిసిందే.  హర్లీ డేవిడ్ సన్, రాయల్ ఎన్ఫీల్డ్, డుకాటీ, యమాహా కంపెనీకి చెందిన బైక్ లతో పాటు రెండు కవాసీకి బైక్ లు ఉన్నాయి. జింబాబ్వేతో వన్డే సిరీస్ను భారత్ 3-0తో గెలిచిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో తొమ్మిది వికెట్లతో గెలిచిన ధోని సేన..రెండో వన్డేను ఎనిమిది వికెట్లతో, మూడు వన్డేను వికెట్లేమీ కోల్పోకుండా  గెలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs zimbabwe 2016  mahendra singh dhoni  bike ride  police bike  india  zimbabwe  cricket  

Other Articles