Ambati Rayudu: Happy with way my ODI career has gone

Ambati rayudu happy with his progress in odis

ambati rayudu, rayudu, rayudu india, ambati rayudu india, rayudu india selsction, india vs zimbabwe, ind vs zim, india zimbabwe, zimbabwe, zimbabwe national cricket team, india national cricket team, harare, cricket

Ambati Rayudu has never been a regular in India’s ODI team. but on recent tours to Zimbabwe, Ambati Rayudu has been the obvious choice for selectors.

గొప్ప అనుభూతిని కలిగించింది..

Posted: 06/14/2016 06:57 PM IST
Ambati rayudu happy with his progress in odis

జింబాబ్వే పర్యటనలో వెయ్యి వన్డే పరుగులను పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ అంబటి రాయుడు తన ప్రదర్శనపై సంతప్తి వ్యక్తం చేశాడు. తన వన్డే కెరీర్ ఇప్పటివరకూ సంతప్తికరంగానే సాగుతూ వచ్చిందని స్పష్టం చేశాడు.  జట్టుకు అవరసమైన ఇన్నింగ్స్ ఆడుతూ తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే తన ముందున్న కర్తవ్యమని అంబటి తెలిపాడు. దీనిలో భాగంగా తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవడంపై ప్రస్తుతం దృష్టి నిలిపినట్లు పేర్కొన్నాడు.

విశేషమైన ప్రతిభ ఉండి కూడా భారత క్రికెట్ జట్టులో ఇప్పటివరకూ రెగ్యులర్ ఆటగాడిగా స్థానం సంపాదించలేకపోయిన క్రికెటర్ అంబటి రాయుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం వన్డేల్లో అరంగేట్రం చేసినా క్రికెట్ జట్టులో స్థానాన్ని మాత్రం సుస్థిరం చేసుకోలేపోయాడు.  తనకొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నా, కొన్ని సమయాల్లో పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోతూ వస్తున్నాడు.
 
అయితే భారత జట్టు జింబాబ్వే పర్యటనలో భాగంగా మరోసారి జట్టులోకి వచ్చిన అంబటి రాయుడు తొలి రెండు వన్డేల్లోనూ ఆకట్టుకున్నాడు. తొలి వన్డేల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచిన అంబటి.. రెండో వన్డేలో 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డే ద్వారా వెయ్యి పరుగుల క్లబ్లో చేరాడు.  దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి సంయుక్తంగా  వన్డేల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకూ 33 వన్డేలు ఆడిన అంబటి 50.23 సగటుతో 1055 పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ambati Rayudu  team india  india  zimbabwe  cricket  

Other Articles