KL Rahul registers highest score on ODI debut for India

India s rahul a member of rare group

india,india tour of zimbabwe 2016,india vs zimbabwe,india vs zimbabwe 2016, kl rahul,, Zimbabwe v/s India, Cricket, Zimbabwe, Chamu Chibhabha, Elton Chigumbura, Harare, kl rahul maiden century, rahul zimbamwe century, Jasprit Bumrah, Dhawal Kulkarni, Axar Patel, Barinder Sran, Karun Nair, Mahendra Singh Dhoni

From Sydney to Harare, KL Rahul's first 18 months of international cricket has produced a rare achievement

కె ఎల్ రాహుల్ అరుదైన రికార్డు..

Posted: 06/14/2016 05:28 PM IST
India s rahul a member of rare group

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా  అరంగేట్రంలోనే శతకం చేసిన భారత తొలి ఓపెనర్గా, బ్యాట్స్మెన్ గా అరుదైన ఘనతను సాధించి  క్రికెట్ విశ్లేషకుల మన్ననలను అందుకున్న కేఎల్ రాహుల్ మరో మైలురాయిని నమోదు చేశాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సోమవారం జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో రాహుల్(33) పరుగులు చేశాడు.  తద్వారా వన్డేల్లో మొదటిసారి ఆడిన ఆటగాడు అవుటయ్యే వరకూ చేసిన పరుగులను ఘనతను రాహుల్ తన పేరిట లిఖించుకున్నాడు.  తొలి వన్డేలో సిక్స్ తో సెంచరీ చేసిన రాహుల్ అజేయం నిలవగా, ఈ మ్యాచ్లో 33 పరుగులు చేశాడు.

దీంతో రాహుల్ అవుటయ్యే వరకూ చేసిన పరుగులు 133. ఇది  ఓ భారత ఆటగాడు అరంగేట్రంతో పాటు తొలి అవుటయ్యే వరకూ  చేసిన అత్యధిక పరుగుల రికార్డుగా నమోదైంది. అంతకుముందు ఈ రికార్డు వుర్కరీ రామన్ పేరిట ఉంది.   రామన్ అరంగేట్రం చేసి తొలి అవుటయ్యే వరకూ చేసిన 103 పరుగులు.1988లో వెస్టిండీస్ జరిగిన  వన్డే సిరీస్ ద్వారా రామన్ అరంగేట్రం చేశాడు. విండీస్ తో ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా జనవరి రెండవ తేదీన మూడో వన్డే ద్వారా రామన్ జట్టులోకి వచ్చాడు. మూడో వన్డేలో ఎనిమిది పరుగులు చేసి అజేయంగా ఉన్న రామన్, ఆ తదుపరి వన్డేలో 95 పరుగులు చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ind vs zim 2016  India  Cricket  Zimbabwe  kl rahul  maiden century  

Other Articles