IPL 9: Warner's Unbeaten 93 Guides SRH To Maiden Final

Sunrisers hyderabad s road to the final

ipl 2016, ipl, ipl play-offs, ipl final, david warner, david warner srh, david warner hyderabad, srh david warner, srh vs gl, gujarat hyderabad, sunrisers Hyderabad, Gujarat Lions, SRH vs GL, hyderabad, Qualifier 2,IPL 9,Cricket latest IPL 9 news

A blistering 93-run knock from David Warner followed by a quickfire cameo from Bipul Sharma helped Sunrisers Hyderabad reach the final of the 2016 Indian Premier League.

బిగ్ ఫైట్ కు చేరుకున్న సన్ రైజర్స్.. టైటిల్ పోరే తుది సమరం

Posted: 05/28/2016 05:39 PM IST
Sunrisers hyderabad s road to the final

ఐపీఎల్‌-సీజన్ 9లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ది బిగ్ ఫైట్ కు చేరుకుంది. ఇక ఆదివారం జరగనున్న చిట్టచివరి టైటిల్‌ పోరుకు సన్నదం అవుతుంది. కోల్ కత్తా నైటరైడర్స్ తో ఎలిమినేటర్ రౌండ్ లో గెలిచిన మంచి ఊపు మీద వున్న సన్ రైజర్స్, అదే స్పీడు కొనసాగించి క్వాలిఫయర్‌-2లో గుజరాత్ లయన్స్‌ను చిత్తుచేసింది. గుజరాత్ లయన్స్ తో జరిగిన క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయిన రైజర్స్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 నాటౌట్‌) అజేయ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. బిపుల్‌ శర్మ (11 బంతుల్లో 3 సిక్సర్లతో 27 నాటౌట్‌) చివర్లో మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో కౌశిక్‌, బ్రావో రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆరోన్‌ ఫించ్‌ (32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) అర్ధ సెంచరీతో రాణించాడు. బ్రెండన్‌ మెకల్ల మ్‌ (32), దినేశ్‌ కార్తీక్‌ (26) కీలక ఇన్నింగ్స్‌ ఆడా రు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, బెన్‌ కటింగ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.
 
గుజరాత్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేధించడంలో సన్‌రైజర్స్‌ తడబడింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (0) పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌ గా వెనుదిరిగా డు. వన్‌డౌన్‌లో వచ్చిన హెన్రిక్స్‌ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. అటు యువరాజ్‌ కౌశిక్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి స్మితకు చిక్కాడు. ఆ తరువాత దీపక్‌ హుడా (4), బెన్‌ కటింగ్‌ (8) కూడా అవుటయ్యా రు. దీంతో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమై, 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్‌ కష్టాల్లో పడింది.
 
అయినా ధైర్యాన్ని కోల్పోని వార్నర్‌ జట్టుని విజయం దిశగా నడిపించాడు. బౌండ్రీతోనే పరుగుల ఖాతా తెరిచిన డేవిడ్‌.. 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వార్నర్‌కు జతకలిసిన బిపుల్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడి ఒత్తిడి తగ్గించాడు. చివరి నాలుగు ఓవర్లలో 45 పరుగులు కావాల్సిన దశలో ప్రవీణ్‌, కులకర్ణి బౌలింగ్‌ల్లో బిపుల్‌ రెండు సిక్సర్లు రాబట్టాడు. బ్రావో వేసిన 19వ ఓవర్లో వార్నర్‌ 4, 2, 2 4, 1 కొట్టగా ఆఖరి బంతికి బిపుల్‌ శర్మ భారీ సిక్సర్‌ సాధించాడు. దీంతో ఆఖరి ఓవర్లో రైజర్స్‌ విజయానికి 5 పరుగులు అవసరమ య్యాయి. ప్రవీణ్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతిని బౌండ్రీకి తరలించిన వార్నర్‌.. ఆ తర్వాత సింగిల్‌ తీసి రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
 
టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన గుజరాత ఓపెనర్‌ ఏకలవ్య ద్వివేది పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సురేష్‌ రైనా (1) కూడా ఎంతోసేపు నిలవలేదు. బౌల్ట్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 3.2 ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన లయన్స్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో మెకల్లమ్‌, కార్తీక్‌ జట్టును ఆదు కున్నారు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడడంతో జట్టు స్కోరు 8 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. ఇక బిపుల్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో 4, 6తో అలరించిన కార్తీక్‌ ఆ తర్వాతి బంతికే రనౌటయ్యాడు.

కానీ.. ఫించ్‌, జడేజా ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఫించ్‌ ధాటిగా ఆడుతుంటే జడేజా అతడికి సహకరించాడు. 14వ ఓవర్లో ఫించ్‌ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ రాబట్టాడు. ఆ తర్వాత బౌల్ట్‌ బౌలింగ్‌లోనూ రెండు ఫోర్లు సాధించాడు. బెన్‌ కటింగ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన ఫించ్‌ 31 బంతుల్లో నే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ.. ఆ తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. చివర్లో డ్వేన్‌ బ్రావో (20) నాలుగు బౌండ్రీలు బాదడంతో గుజరాత 160 మార్కు దాటింది. జడేజా (19 నాటౌట్‌), కులకర్ణి (3 నాటౌట్‌) అజేయంగా నిలిచారు.
 
స్కోరు వివరాలు
గుజరాత్: ద్వివేది (సి) బౌల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 5, మెకల్లమ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) బిపుల్‌ శర్మ 32, రైనా (ఎల్బీ) బౌల్ట్‌ 1, కార్తీక్‌ (రనౌట్‌) 26, ఫించ్‌ (బి) కటింగ్‌ 50, స్మిత (సి) ధవన్‌ (బి) కటింగ్‌ 1, జడేజా (నాటౌట్‌) 19, బ్రావో (బి) భువనేశ్వర్‌ 20, కులకర్ణి (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 162/7; వికెట్లపతనం: 1-7, 2-19, 3-63, 4-81, 5-83, 6-134, 7-158; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-2, బౌల్ట్‌ 4-0-39-1, బరీందర్‌ 3-0-28-0, బిపుల్‌ 3-0-21-1, కటింగ్‌ 3-0-20-2, హెన్రిక్స్‌ 3-0-27-0.
 
సన్‌రైజర్స్‌: వార్నర్‌ (నాటౌట్‌) 93, ధవన్‌ (రనౌట్‌) 0, హెన్రిక్స్‌ (సి) ద్వివేది (బి) స్మిత 11, యువరాజ్‌ (సి) స్మిత (బి) కౌశిక్‌ 8, హుడా (ఎల్బీ) బ్రావో 4, కట్టింగ్‌ (సి) కార్తీక్‌ (బి) కౌశిక్‌ 8, నమన్‌ (సి) జడేజా (బి) బ్రావో 10, బిపుల్‌ శర్మ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 19.2 ఓవర్లలో 163/6; వికెట్లపతనం: 1-6, 2-33, 3-61, 4-75, 5-84, 6-117; బౌలింగ్‌: ప్రవీణ్‌ 3.2-0-32-0, కులకర్ణి 4-0-32-0, స్మిత 2-0-29-1, రైనా 2-0-15-0, కౌశిక్‌ 4-0-22-2, బ్రావో 4-0-32-2.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  David Warner  Sunrisers Hyderabad  IPL final  Royal Challengers  Gujarat Lions  

Other Articles