మార్కెట్లో కోహ్లీ గిరాకీ అదిరింది | Virat Kohli third place in more marketable player list

Virat kohli third place in more marketable player list

virat kohli, more marketable player list, kohli SportsPro list, కోహ్లీ, స్పోర్ట్స్ ప్రో లిస్ట్, మోస్ట్ మార్కెటబుల్ ప్లేయర్, క్రీడా వార్తలు, sports news, kohli, more marketable player list, latest news, sports

Virat Kohli has been named as Third Most Marketable Sportsperson accoding to SportsPro list. NBA's 'Most Valuable Player' Stephen Curry and Juventus' French international Paul Pogba were top two positions.

మార్కెట్లో కోహ్లీ గిరాకీ అదిరింది

Posted: 05/27/2016 11:31 AM IST
Virat kohli third place in more marketable player list

ఫార్మట్ ఏదనేది చూడకుండా తన బ్యాట్ ఝుళిపిస్తూ పరుగుల వదర పారిస్తున్నాడు టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ సీజన్ ఐపీఎల్ లో ఈ స్టార్ బ్యాట్స్ మెన్ చేసిన స్కోర్ చూస్తే ఎవరికైనా మతిపోవటం ఖాయం. 15 మ్యాచ్ లలో 4 సెంచరీలు, 6 అర్థసెంచరీలు సాధించడమంటే మాములు విషయం కాదు. ఇలా వరుస రికార్డులతో దూసుకెళ్తున్న కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.  ‘మోస్ట్ మార్కెటబుల్ ప్లేయర్స్’ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఉద్ధండ పిండాలను సైతం పక్కకు నెట్టేశాడు.

‘స్పోర్ట్స్ ప్రో’  వెల్లడించిన తాజా జాబితా ప్రకారం కోహ్లీ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లో బాస్కెట్ బాల్ క్రీడాకారుడు స్టీఫెన్ కరె తొలిస్థానంలో ఉండగా. ఫ్రెంచ్ ఫుట్ బాల్ క్రీడాకారుడు పాల్ పోగ్బా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టెన్నిస్ నంబర్ 1 జకోవిచ్ ఈ జాబితాలో 23 వ స్థానంలో, మెస్సీ 27 వ స్థానంలో నిలవగా, స్ర్పింట్‌ కింగ్‌ ఉసేన్‌ బోల్ట్‌ 31వ స్థానంతో సరిపెట్టుకున్నారు.  టాప్ 50 జాబితాలో  హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు కూడా చోటు దక్కటం విశేషం. కాగా, ఆటగాళ్ల సంపాదన, వయసు, ఆస్తుల విలువ, వాళ్లకున్న పాపులారిటీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్పోర్ట్స్ ప్రో ఏటా ఈ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  more marketable player list  SportsPro list  

Other Articles