Krunal Pandya special helps Mumbai Indians rise up to third spot

Krunal pandya powers mumbai to crucial win

IPL 2016, Krunal Pandya, mumbai indians, bating order, mumbai indians ipl, delhi dare devils, delhi dare devils ipl, game plan, cricket ipl, cricket

A blistering knock from Krunal Pandya and a disciplined bowling effort helped Mumbai Indians register an 80-run win against Delhi Daredevils.

అది కూడా గేమ్ ప్లాన్ లో భాగమే

Posted: 05/17/2016 08:46 PM IST
Krunal pandya powers mumbai to crucial win

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. కృనాల్ 37 బంతులెదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగిపోయాడు.తాను  బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావడానికి ఢిల్లీ డేర్ డెవిల్స్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడమే కారణమని కృనాల్ తెలిపాడు.

'ఢిల్లీ ముగ్గురు స్పిన్నర్లతో మాపై పోరుకు సిద్ధమైంది. దాంతో  నా బ్యాటింగ్ ఆర్డర్ను ఫస్ట్ డౌన్కు మార్చారు. స్పిన్నర్లను ప్రధాన లక్ష్యంగా చేసుకుని హిట్టింగ్ చేయడం గేమ్ ప్లాన్లో భాగమే. అది మంచి ఫలితాన్నిచ్చింది' అని కృనాల్ తెలిపాడు. ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ చేయడానికి సహచర ఆటగాడు మార్టిన్ గప్తిల్ నుంచి చక్కటి సహకారం అందిందన్నాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు మార్టిన్ తనకు అనేక సూచనలు చేయడం వల్లే దాటిగా బ్యాటింగ్ చేశానని కృనాల్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Krunal Pandya  mumbai indians  bating order  cricket  

Other Articles