BCCI welcomes appointment of Anil Kumble and Rahul Dravid in ICC

Icc appoints rahul dravid in cricket committee

bcci, anil kumble, kumble, kumble icc cricket committee chairman, icc cricket committee, rahul dravid, dravid, rahul dravid icc, bcci anil kumble, bcci rahul dravid, cricket

The ICC has appointed former India captain Rahul Dravid and ex-Sri Lankan batsman Mahela Jayawardene in its Cricket Committee

ద్రావిడ్కు కీలక బాధ్యతలు.. యధాస్థానంలో అనీల్ కుంబ్లే

Posted: 05/13/2016 06:08 PM IST
Icc appoints rahul dravid in cricket committee

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీలో టీమిండియా ఇద్దరు భారతీయ మాజీ క్రికెటర్లకు స్థానం దక్కింది, ఇప్పటికే బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గా ఎన్నికైన తరుణంలో మరో ఇద్దరు భారతీయ మాజీ క్రికెటర్లకు కూడా స్థానం దక్కడం గమనార్హం. వీరితో పాటు శ్రీలంక క్రికెటర్ కు కూడా స్థానం లభించింది. శ్రీలంక మాజీ క్రికెటర్ మహెళా జయవర్దనేను ఐసీసీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.

భారత్ ఏ, అండర్-19 జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్న నాటి టీమిండియా ది వాల్, మిస్టర్ ఢిఫెండబుల్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్కు మరో కీలక బాధ్యత దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీలో ద్రావిడ్ను సభ్యుడిగా నియమించారు, ద్రావిడ్ తో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ టిమ్ మేను నియమించారు. వీరు మూడేళ్ల పాటు కమిటీలో కొనసాగనున్నారు. పదవీకాలం ముగిసిన సంగక్కర, లక్ష్మణ్, మార్క్ టేలర్ స్థానాల్లో వీరిని ఎన్నుకున్నారు.

ఈ నెల 31, జూన్ 1న జరిగే ఐసీసీ క్రికెట్ కమిటీ తొలిసమావేశంలో వీరు పాల్గొంటారు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమితుడయ్యాడు. 2012లో కుంబ్లేకి తొలిసారి ఈ బాధ్యతలు అప్పగించారు. తాజా నియామకంతో కుంబ్లే 2018 వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. కమిటీలో అంపైర్ల ప్రతినిధిగా స్టీవ్ డేవిస్ స్థానంలో రిచర్డ్ కెటిల్బరో ఎన్నికయ్యాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  ICC cricket committee  bcci  anil kumble  cricket  

Other Articles