after dhoni harbhajan singh impressed with vizag beach

Vizag or durban harbhajan comments on vizag beach

mahendra singh dhoni, harbhajan singh, vizag city, vizag beach, mumbai indians, twitter, durban beach, south africa, indian spinner

mumbai indians spinner harbhajan in impressed by vizag beach, says its more than durban beach in south africa

మహి తరువాత అదే బాటలో భజ్జీ..

Posted: 05/08/2016 12:58 PM IST
Vizag or durban harbhajan comments on vizag beach

టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్, పూణే సూపర్ జెయింట్స్ సారధి మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని బాటలోనే టీమిండియా సీనియర్ బౌలర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పయనించాడు. విశాఖ అందాలకు ముగ్ధుడయ్యాడయిన భజ్జీ.. అర్కే బీచ్ అందాలను చూసి తన్మయుడయ్యాడు. సాగరతీరం అందాలను చూసి పులకించిపోయాడు. అహా ఏమి అద్భుతం.. ఇన్నాళ్లు చూడలేదు.. కానీ ఇది అత్యంత అద్వితీయమైన నగరమని కితాబిచ్చాడు. వెంటనే సాగరతీరం ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

విశాఖ బీచ్ అద్భుతంగా ఉందని డర్బన్ (దక్షిణాఫ్రికా)తో పోల్చాడు. ఇది వైజాగా లేక డర్బనా అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. ఇవాళ విశాఖలో  సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు ఇక్కడికి వచ్చాడు. విశాఖ తీరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులతో కలసి బసచేశాడు. హోటల్ రూమ్ నుంచి బీచ్ను చూసి ఫిదా అయిన భజ్జీ వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బీచ్ మనోహరంగా ఉందంటూ ప్రశంసించాడు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vizag  Durban  Harbhajan singh  Vizag beach  Mumbai Indians  

Other Articles