Peter Moores turns down chance to coach Pakistan

Moores declined pakistan approach

Coach, Dean Jones, Grant Flower, Head coach, Jamie Siddons, Mickey Arthur, Pakistan, Pakistan Cricket Board, PCB, Peter Moores, Ramiz Raja, Tom Moody, Wasim Akram

Former England coach Peter Moores has turned down an opportunity to succeed Waqar Younis as the new Pakistan coach.

పాక్ కోచ్ పదవికి మూర్స్ విముఖత..

Posted: 05/03/2016 06:17 PM IST
Moores declined pakistan approach

స్వదేశీ కన్నా విదేశీ కోచ్ కే ఎక్కువ మొగ్గు చూపిస్తూ వెళ్లిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అక్కడ పరాభవమే ఎదురైంది. పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవి చేపట్టడానికి ఇంగ్లండ్ మాజీ కోచ్ పీటర్మూర్స్ విముఖత వ్యక్తం చేశాడు. పాక్ క్రికెట్ జట్టు కోచ్ పదవిని చేపట్టడానికి తనకు  ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆహ్వానం అందినట్లు తెలిపాడు. కాగా పాక్ కోచ్ పదవిని చేప్టేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉంటూ నాటింగ్హమ్ షైర్కు కన్సెల్టెంట్ గా వ్యవహరిస్తున్నట్లు మూర్స్ పేర్కొన్నాడు.
 
'కోచ్ పదవి కోసం నన్ను పీసీబీ సంప్రదించింది. దాని గురించే ఆలోచించడానికి ఇది సరైన సమయం కాదనే అనుకుంటున్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్న నేపథ్యంలోనే నేను దాని పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నా. నా పిల్లలు కూడా పెరుగుతున్నారు. దాంతో పాటు నాటింగ్హమ్షైర్తో ఒప్పందం ఉంది. ఈ సమయంలో పాక్ కోచ్ పదవిని చేపట్టలేను' అని మూర్స్ తెలిపాడు. గతేడాది ఇంగ్లండ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన మూర్స్ ఆ జట్టుకు రెండు సార్లు కోచ్ గా పని చేశాడు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : peter moores  england  pakistan cricket coach  pcb  

Other Articles