Sachin Tendulkar reveals he did not have money for a cab ride during his childhood days

Had no money for cab ride then walked with two big bags says tendulkar

ICC Cricket World Cup (ODI),ICC World Test Championship,Indian Cricket,Mumbai Cricket,Sachin Tendulkar,Cricket'>ket,Sachin Tendulkar,Cricket

Cricket icon Sachin Tendulkar, among the richest sportsmen in the country, today recalled a time in his life when he did not have money to hire a cab for a ride home from the railway station on his return from Pune after an under-15 cricket game.

చిన్ననాటి చేధు అనుభవాలను గుర్తుచేసుకున్న సచిన్

Posted: 04/27/2016 06:43 PM IST
Had no money for cab ride then walked with two big bags says tendulkar

ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ అటగాడిగా ఖ్యాతి గడించిన భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇప్పుడు అపర కుబేరుడే. అయితే ఆయన కూడా ఓ సమయంలో క్యాబ్‌కు డబ్బులు చెల్లించలేని పరిస్థితిని  ఫేస్ చేయవలసి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గుర్తు చేసుకున్నాడు. ఓ సమయంలో తనకు తన ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు క్యాబ్‌కు ఇచ్చేందుకు డబ్బులు లేని పరిస్థితి ఉండేదన్నాడు. తాను అండర్ 15 క్రికెట్ గేమ్ ఆడేందుకు పుణే వెళ్లానని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు స్టేషన్ నుంచి క్యాబ్‌లో వచ్చేందుకు డబ్బులు కూడా లేవని చెప్పాడు.

'నాకు 12 ఏళ్ల వయస్సున్నప్పుడు ముంబై అండర్ 15 జట్టుకు సెలక్ట్ అయ్యాను. నేను సెలక్ట్ కావడంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కొంత డబ్బు తీసుకొని పుణే వెళ్లాను. అక్కడ మూడు మ్యాచులు ఆడేందుకు వెళ్లాను.' అని సచిన్ చెప్పాడు. 'నేను మ్యాచ్ ఆడాను. నేను 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్ అయ్యాను. నేను అసంతృప్తికి గురయ్యాను. అసంతృప్తితో డ్రెస్సింగ్ రూంకు వచ్చాను. ఏడ్చాను. ఆ తర్వాత తనకు మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే అక్కడ భారీ వర్షం కురుస్తోంది.' అని చెప్పాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'రోజంతా వర్షం కురుస్తుండటంతో ఏం చేయలేకపోయాం. దీంతో బయటకు వెళ్లాం. సినిమా చూశా. బయటకు వెళ్లి తిన్నాను. డబ్బు ఎలా పద్ధతిగా లేదా పొదుపుగా ఖర్చు చేయాలో అప్పుడు నాకు తెలియదు. డబ్బంతా ఖర్చు చేశాను. ఆ తర్వాత రైలులో ముంబైకి వచ్చాను. నా వద్ద అప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నేను రెండు పెద్ద సంచులు తీసుకు వచ్చాను. స్టేషన్లో దిగిన తర్వాత నేను శివాజీ పార్కు వైపు నడక సాగించాను. ఎందుకంటే అప్పుడు నా వద్ద ఒక్క రూపాయి లేదు.' అని టెండుల్కర్ నాటి సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు.

అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు అంతగా రాలేదన్నాడు. అయితే తాను డబ్బులను పోదుపుగా వాడి వుండినట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్నాడు. తాను అలా కాకుండా డబ్బున్నంతా ఖర్చుచేయడం వల్లే తనకీ పరిస్థితి వచ్చిందన్నాడు. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా సచిన్ చెప్పాడు. అదే కనక సెల్ ఫోన్ ప్రపంచం అప్పటికే విస్తరించి వుంటే.. తన వద్ద కూడా ఒక మొబైల్ ఫోన్ ఉండి ఉంటే.. తాను ఓ ఫోన్ కాల్ లేదా మెసేజ్ పెడితే తన తండ్రి లేదా తల్లి తనకు డబ్బులు అరేంజ్ చేసేవారని, అప్పుడు తాను క్యాబ్ మాట్లాడుకొని వెళ్లేవాడిని' అని సచిన్ చెప్పాడు. ఇలా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  sachin tendulkar  team india  cab  pune  home  

Other Articles