IPL should ideally stay where it belongs feels Ravi Shastri

It s my job to handle alpha males dhoni and virat says ravi shastri

bcci, cricket, Indian Premier League, IPL 2016, ipl 9, MS Dhoni, Ravi Shastri, virat kohli, team india, director, Ayaz Memon, IPL

The Indian Premier League (IPL) will find markets abroad, but it should ideally stay where it belongs, that's the view of team India coach Ravi Shastri.

కోహ్లీ, ధోనిలతో పాటు క్రికెటర్ల అందరినీ హ్యాండిల్ చేశాను

Posted: 04/24/2016 10:45 AM IST
It s my job to handle alpha males dhoni and virat says ravi shastri

విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, ఇలా ప్రతిఒక్క ఆటగాడిని తాను హ్యాండిల్ చేశానని వారికి అవసరమైనప్పుడు తగిన సూచనలు ఇచ్చేవాడినని మాజీ క్రికెటర్, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. వారిని దారిలోకి తీసుకురావడం, వారి ఫామ్ లో లేకుంటే లోపాలను సరిదిద్దడం తన బాధ్యతగా తీసుకున్నానని చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను విదేశాలలో నిర్వహిస్తారన్న వార్తలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

ఐపీఎల్ టోర్నీని వచ్చే ఏడాది ఎక్కడ నిర్వహిస్తారని మాజీ క్రికెటర్, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిని ప్రశ్నించగా... ఈ టోర్నీని ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉందన్నాడు. విదేశాలలో నిర్వహించడం మంచి విషయమే కానీ ఇండియాలో ఉన్నంత జోష్ అక్కడ ఎలా వస్తుందంటూ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ నిర్వహణలో లోపాలున్నాయని ఆరోపణలొస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు.  ఐపీఎల్ లో తనకు తెలిసినంతవరకూ కేవలం ఐదు, ఆరు శాతం మాత్రమే నెగటివ్స్ ఉన్నాయన్నారు.

అంతమాత్రాన ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే టోర్నీపై విమర్శలు చేయడం తగదన్నారు. టీమిండియాకు డైరెక్టర్ గా మాత్రమూ కాకుండా ఆటగాళ్లతో చాలా కలుపుగోలుగా ఉంటూ వారిలో ఉత్సాహాన్ని నింపాడు. ఐపీఎల్ ను కొందరు ఆటలాగానే చూస్తున్నారు కానీ, భారీ వ్యాపారం జరిగి ఎంతో మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నాడు. బీసీసీఐ నూతనంగా ఏర్పాటుచేసిన సీఈఓ పదవి అనేది బోర్డు చేసిన మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  director  bcci  ravi shastri  virat kohli  mahendra singh dhoni  Ayaz Memon  IPL  

Other Articles