IPL 2016, RPS vs RCB: Virat Kohli fined Rs 12 lakh for slow over-rate against Pune

Kohli fined rs 12 lakh for slow over rate against pune

rps vs rcb, rcb vs rps, ipl 2016, ipl, virat kohli, kohli, indian premier league, royal challengers bangalore, cricket news, ipl news, cricket

Virat Kohli was fined Rs 12 lakhs after his team Royal Challengers Bangalore maintained a slow over-rate against Pune.

పూణేతో మ్యాచులో.. విరాట్ కోహ్లీకి భారీ జరిమానా..!

Posted: 04/23/2016 05:06 PM IST
Kohli fined rs 12 lakh for slow over rate against pune

విధ్వంసకరమైన బ్యాటింగ్ కు అలవాలమైన పొట్టి క్రికెట్ లో గెలుపు ఎప్పుడు ఏ ఒక్కరి సోంతం కాదు, ఎప్పుడు ఏ క్షణాన మ్యాచ్ మలుపు తిరుగుతుందో కూడా తెలియదు అదే టీ 20 ఫార్మెట్ అంటూ ఇప్పటికే విశ్లేషుకులు చెప్పారు, అయితే ప్రత్యర్థులను కట్టడి చేయడానికి జట్టు కెప్టెన్లు ఎంతో శ్రమిస్తారు. అటు మానసికంగా ఇటు శారీరికంగానూ శ్రమించడం మనం చూస్తున్నాం, ప్రత్యర్థులను కట్టడి చేసే పనిలో భాగంగా ఎన్నో వ్యూహాలు రచిస్తుంటారు, అందుకోసం బౌలర్లతో పలు రకాల చర్చలు జరుపుతుంటారు.

ఇక ఫోట్టి క్రికెట్ ఫార్మెట్ లో బ్యాటింగ్ లో అదరగోడుతున్న బెంగుళూరు ఇటు బౌలింగ్ విభాగంలో మాత్రం బలహీనంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ బలహీనతను అధిగమించే క్రమంలో కీలకమైన ఓవర్లను ఏ బౌలర్ తో వేయించాలా అని తెగ మథనపడిపోతున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ! అలా ఆ...లోచిస్తూ..చిస్తూ అతను కాలాన్నీ హరిస్తున్నాడు. అయితే పుణే వేదికగా ధోనీ సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆర్ సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ వ్యూహచర్చలతో టైమ్ ను కిల్ చేశారు.

మ్యాచ్ చూసినవారెవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ప్రేక్షకుల కన్నా ఈ విషయం రిఫరీకి బాగా అర్థమైంది. అందుకే కోహ్లీకి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సారథి కోహ్లీకి జరిమానా విధిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం రిఫరీలు ప్రకటించారు. జరిమానా అంతాఇంతా కాదు  ఏకంగా 20 వేల డాలర్లు! మన కరెన్సీలో రూ.13.3 లక్షలు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ కు ఇంత భారీ స్థాయిలో జరిమానా ఉండదు కానీ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల్లో జరిమానాల స్థాయి భారీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ముగించాల్సిన సమయానికి ఆర్ సీబీ రెండు ఓవర్లు వెనుకబడిపోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 9  RCB captain  Virat Kohli  fined  Rising Pune Supergiants  

Other Articles