ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా మొహాలీ వేదికగా జరుగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ మరో విజయాన్ని అందుకున్నారు. దీంతో ఐపీఎల్ సీజన్ 9లో మూడవ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రత్యర్థి పంజాబ్ విసిరిన 139 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించడంతో పాటు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు అడిన కోల్ కత్తా కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓటమిని చవిచూసింది. మూడు మ్యాచ్ లలో విజయాన్ని నమోదు చేసుకుని ఆరు పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా 1.075తో కొనసాగుతుంది.
ప్రత్యర్థి జట్టు విధించిన 139 పరుగుల లక్ష్యచేధనలో రాబిన్ ఉతప్ప (28 బంతుల్లో 53; 9 ఫోర్లు), గౌతమ్ గంభీర్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు)లు చెలరేగడంతో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. తొలి ఆరు ఓవర్లలో గంబీర్, ఉతప్పల ఓపెనర్ల జోడి 65 పరుగులు సాధించింది. ఇదే క్రమంలో కేవలం 24 బంతుల్లో అర్థ సెంచరీని సాధించి, ఈ సీజన్‌లో మూడో ఫాస్టెస్ట్ అర్ధసెంచరీని ఉతప్ప తన పేరున నమోదు చేసుకున్నాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 9వ ఓవర్‌లో సాహునే విడదీశాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలో 82 పరుగులు జత చేశారు.
ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని మరో 17 బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది, చివర్లో యూసుప్ పటాన్, సూర్యకుమార్ లు బంతిని బౌండరీలు దాటించడంతో కోల్ కత్తా సునాయాసంగా విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేట్ రెండు, ప్రదీప్ సాహు రెండె వికెట్లు సాధించారు, మిగతా బౌలర్లు సందీప్ శర్మ, అబాట్, మోహిత్ శర్మ, మాక్స్ వెల్ లు అకట్టుకోలేకపోయారు. మెరుగైన ప్రదర్శనను కనబర్చిన రాబిన్ ఉతప్పకు మ్యాచ్ అప్ ది మ్యాచ్ లభించింది.
కాగా ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. టాస్ ఓడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్ బ్యాట్స్ మన్ ఆ స్థానానికి తగ్గ ఆటతీరునే ప్రదర్శించారు. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ బ్యాటింగ్ రానివారిలా పెవిలియన్ కు క్యూ కట్టారు. పంజాబ్ బ్యాట్స్ మన్ లో ఓపెనర్ మురళీ విజయ్ (26), షాన్ మార్ష్ (56) రాణించగా, చివర్లో బౌలర్ అబాట్ (12) రెండంకెల స్కోరు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 138 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో మోర్కెల్, నరైన్ చెరో రెండు వికెట్లు తీసి రాణించగా, యాదవ్, పఠాన్, చావ్లా చెరో వికెట్ తీసి వారికి సహకరించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more