England cricketer James Taylor forced to retire with heart condition

James taylor retires from cricket due to serious heart condition

james taylor, james taylor england, england james taylor, james taylor retirement, james taylor retires, taylor england cricketer

The Nottinghamshire and England batsman James Taylor has been forced to retire from all cricket after it was discovered that he has a serious heart condition.

అంతర్జాతీయ క్రికెట్ కు జేమ్స్ టైలర్ గుడ్ బై

Posted: 04/12/2016 07:44 PM IST
James taylor retires from cricket due to serious heart condition

ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జేమ్స్ టేలర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. జట్టు విజయంలో కీలక భూమిక పోఫించాల్సిన ఆయన ఇక జట్టుకు దూరం కానున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ నుంచే కాకుండా దేశవాలీ క్రికెట్ నుంచి తాను వైదోలుగుతున్నట్లు ఆయన వెల్లడించాడు. వయస్సు పైబడక పోయినా.. తీవ్రమైన అనారోగ్య కారణాల వల్లే జేమ్స్ (26) చిన్న వయసులోనే క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. ప్రమాదకర గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు వెల్లడించాడు. మంగళవారం జేమ్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

'నా జీవితంలో ఇది క్లిష్టమైన సమయం. నా ప్రపంచం తలకిందులైంది. జీవన్మరణ పోరాటం చేస్తున్నా' అంటూ జేమ్స్ ట్వీట్ చేశాడు. కారణాలు ఏమిటంటే ఆయన తీవ్రమైన హృద్రోగ సమస్యను ఎదుర్కోంటున్నాడు, ఇటీవల అయన అనారోగ్యంతో అస్పత్రికి వెళ్లగా, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. తక్షణమే క్రికెట్ క్రీడ సహా వేగంగా పరుగెత్తడం, అయాసం వచ్చే పనులకు ఉపక్రమించవద్దని డాక్టర్లు సూచించారు,

దీంతో తాను ఎంతగానో ప్రేమించే క్రికెట్ క్రీడను అర్థంతరంగా వదలిపెట్టాల్సి వస్తుందని ఆయన అవేదన వ్యక్తం చేస్తున్నాడు, తాను జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతున్నానని తెలుసుకుని జేమ్స్ మనోవేదనకు గురయ్యాడు, ఈ వార్త తెలియగానే ఇంగ్లండ్ టీమ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ కెరీర్లో జేమ్స్ 7 టెస్టులు, 27 వన్డేలు ఆడాడు. ఎంతో ఉజ్వల భవిష్తత్తు వున్న జేమ్స్ క్రికెట్ కు గుడ్ బై చెప్పే నిర్ణయం తీసుకోవడం తమను బాధిస్తుందన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles